అల.. వైకుంఠపురములో మేకింగ్ వీడియో: బన్నీ పిల్లల సందడి.. వెంకటేష్ సర్‌ప్రైజ్

Recommended Video

#AlaVaikunthapurramuloo - Movie Making - Allu Arjun, Pooja Hegde - Trivikram - Thaman S

అల్లు అర్జున్ తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో'. ఓ రేంజ్ అంచనాల నడుమ ఈ సినిమాలో సంక్రాంతి బరిలో దిగబోతోంది. పోటీ పడుతున్న సినిమాలతో సమరానికి సై అంటూ రంగంలోకి దిగుతున్నారు బన్నీ టీమ్. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన యూనిట్ సభ్యులు తాజాగా అల.. వైకుంఠపురములో మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. వివరాలు చూస్తే..

గ్రాండ్ ఈవెంట్.. ప్రేక్షకుల్లో నూతనోత్సాహం

గ్రాండ్ ఈవెంట్.. ప్రేక్షకుల్లో నూతనోత్సాహం

మెగా అభిమానులను అబ్బురపరిచేలా ఇటీవలే గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది 'అల.. వైకుంఠపురములో' టీమ్. ఈ ఈవెంట్‌కి స్పెషల్ గెస్ట్‌గా ఏ టాలీవుడ్ హీరో రానప్పటికీ జనం పోటెత్తారు. అభిమానుల కోలాహలం నడుమ ప్రేక్షకుల్లో నూతనోత్సాహం నింపుతూ అల్లు అర్జున్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.

అదే జోష్.. మరింత హైప్ క్రియేట్ చేస్తూ

అదే జోష్.. మరింత హైప్ క్రియేట్ చేస్తూ

అల.. వైకుంఠపురములో సినిమాను జనవరి 12న భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో బిన్నీ అభిమానుల్లో మరింత జోష్ నింపేలా అప్‌డేట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా 'అల.. వైకుంఠపురములో' మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో చిత్రయూనిట్ అంతా కనిపించారు.

సెట్స్‌పై వెంకటేష్.. సర్‌ప్రైజ్

సెట్స్‌పై వెంకటేష్.. సర్‌ప్రైజ్

ఎంతో ఆకట్టుకుంటున్న ఈ వీడియోలో మూవీ సెట్టింగ్స్‌తో పాటుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే, టబు, త్రివిక్రమ్, అల్లు అరవింద్ కనిపించారు. అదేవిధంగా సెట్స్‌పై వెంకటేష్ కూడా కనిపించి ఒకింత సర్‌ప్రైజ్ చేశారు. చిత్రయూనిట్ అంతా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్న సీన్స్ చూపించి ఆకట్టుకున్నారు.

అల్లు అయాన్, అర్హ సందడి

అల్లు అయాన్, అర్హ సందడి

ఇకపోతే అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అర్హలు చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంటోంది. ఆయన భార్య స్నేహారెడ్డి కూడా కనిపించింది. వెన్నెల కిషోర్, సునీల్ సెట్స్‌పై ఎంజాయ్ చేస్తున్న కొన్ని సన్నివేశాలు చూపించారు. చివరిలో అయాన్ ‘నేనే ప్రొడ్యూసర్ ని' అంటూ చేసే కామెడీ సీన్ బిన్నీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

అల.. వైకుంఠపురములో

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాగా తెరకెక్కింది 'అల.. వైకుంఠపురములో' మూవీ. అల్లు అర్జున్, పూజ హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించారు. సీనియర్ హీరోయిన్ టబు, సుశాంత్, నవదీప్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, నివేద పేతురాజ్, జయరాం, సత్యరాజ్, బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X