ఆమె నా చేయి పట్టుకుని అలా అనేసింది.. దీంతో ఆ రోజంతా.. హీరోయిన్‌పై రాహుల్ రామకృష్ణ కామెంట్
అతితక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక ఐడెంటిటీ తెచ్చుకున్నాడు కమెడియన్ రాహుల్ రామకృష్ణ. తనదైన మాటలతో, యాక్టింగ్‌తో ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన ఆయన ప్రస్తుతం వరుస అవకాశాలు పట్టేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ 'అల.. వైకుంఠపురములో' సినిమాలో ఛాన్స్ పట్టేసిన ఆయన సీనియర్ హీరోయిన్‌తో జరిగిన ఆసక్తికర సంఘటన పంచుకున్నాడు. వివరాల్లోకి పోతే..

విడుదలకు సిద్దమైన 'అల.. వైకుంఠపురములో'
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందింది 'అల.. వైకుంఠపురములో' మూవీ. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు ముఖ్యపాత్ర పోషించగా రాహుల్ రామకృష్ణ కమెడియన్ రోల్ పోషిచాడు. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సెట్స్‌పై జరిగిన ఓ ఆసక్తికర విషయం చెప్పాడు రాహుల్.

టబు గారు నా దగ్గరకు వచ్చి.. ఆ మాట అన్నారు
ట్విటర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టిన రాహుల్.. 'అల..వైకుంఠపురములో' చిత్రంలో టబుతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. 'రాములో రాములా' పాటను చిత్రీకరిస్తున్న సమయంలో టబు గారు నా దగ్గరకు వచ్చారు. అనంతరం ఆమె నా చేయి పట్టుకుని.. 'అర్జున్‌రెడ్డి' చిత్రంలో నా నటన ఎంతగానో నచ్చిందని మెచ్చుకున్నారని తెలిపాడు.

ఆ రోజంతా రంగుల లోకంలో..
అంతటి గొప్ప నటి తనను మెచ్చుకోవడంతో ఆ రోజంతా రంగుల లోకంలో విహరించానని రాహుల్ తెలిపాడు. అలాంటి గొప్ప నటితో 'అల..వైకుంఠపురములో..' నటించడం నా అదృష్టంగా భావిస్తున్నానని రాహుల్ రామకృష్ణ పేర్కొన్నాడు.
'అర్జున్‌రెడ్డి'లో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా..
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం 'అర్జున్‌రెడ్డి'లో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఆ తర్వాత రాహుల్.. సహాయ నటుడిగా పలు చిత్రాల్లో నటిస్తూనే హీరోగా కూడా సినిమాలు చేయడం విశేషం.

'అల.. వైకుంఠపురములో' మూవీ
గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్త సమర్పణలో అల్లు అర్జున్ హీరోగా 'అల వైకుంఠపురములో' రూపొందింది. సంక్రాంతికి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. నివేదా పేతు రాజ్, సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాపై బన్నీ అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











