అల్లు అర్జున్ రికార్డుల సునామీ.. కానీ ఇక్కడ మాత్రం మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ వెనకాలే!
గత కొంతకాలంగా అల్లు అర్జున్ సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. బన్నీ లాస్ట్ మూవీ 'నా పేరు సూర్య' డిసాస్టర్ కావడంతో టాలీవుడ్ ఈ స్టైలిష్ స్టార్ హంగామా నెమ్మదించింది. దీంతో గత జ్ఞాపకాలన్నీ చెరిపేస్తూ ఈ సారి భారీ హిట్‌పై కన్నేశాడు బన్నీ. ఈ మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సహాయంతో రికార్డుల సునామీకి తెరలేపాడు. మహేష్ బాబు, ప్రభాస్ అందరినీ వెనక్కి నెట్టేస్తూ దూసుకుపోతున్నాడనుకునే లోపే ఓ వెనుక పడ్డాడు. వివరాల్లోకి పోతే..

'అల.. వైకుంఠపురములో' టీజర్.. అభిమానుల ఖుషీ
అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డుల సునామీ సృష్టించడం మెగా అభిమానులను ఖుషీ చేస్తోంది. ఈ రోజే (డిసెంబర్ 11) విడుదలైన 'అల.. వైకుంఠపురములో' టీజర్ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది.

సంక్రాంతి హంగామా.. స్టైలిష్ స్టార్ హవా
ఈ టీజర్‌లో చూపించిన సన్నివేశాలు సినిమాపై ఇప్పటికే ఉన్న హోప్స్ డబుల్ చేసేశాయి. మెగా అభిమాని నూర్ మహ్మద్ మృతితో సోమవారమే రావాల్సిన ఈ టీజర్.. కాస్త లేటుగా వచ్చినప్పటికీ సత్తా చాటుతోంది. ప్రస్తుతం టీజర్‌కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇక సంక్రాంతి హంగామా అంతా ఈ స్టైలిష్ స్టార్‌దే అనిపిస్తోంది.

అభిమానుల నీరాజనం..
ఇక ఈ టీజర్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ స్పష్టంగా కనబడుతోంది. మాటల మాంత్రికుడి స్టైల్ ఆఫ్ మేకింగ్, డైలాగ్స్, అల్లు అర్జున్ మ్యానరిజం హైలైట్ అవుతోంది. దీంతో అటు త్రివిక్రమ్ అభిమానులు, ఇటు అల్లు అర్జున్ అభిమానులు ఈ టీజర్‌కి నీరాజనం పలుకుతున్నారు. దీంతో టీజర్ యూట్యూబ్‌లో వ్యూస్ పరంగా దూసుకుపోతోంది.

మహేష్ బాబు, ప్రభాస్ వెనకాలే..
టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత వేగంగా 1 మిలియన్ వ్యూస్ రాబట్టిన టీజర్‌గా రికార్డు నమోదు చేసిన 'అల.. వైకుంఠపురములో' టీజర్ లైకుల విషయంలో మాత్రం వెనుకపడింది. అత్యంత తొందరగా 100K లైక్స్ పొందిన టీజర్ విషయంలో 'అల.. వైకుంఠపురములో' ఎఫెక్ట్ కనిపించలేదు.

100K లైక్స్ టాప్‌లో..
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు టీజర్ 18 నిమిషాల్లో 100K లైక్స్ రాబట్టి టాప్ లో నిలవగా, ప్రభాస్ సాహో టీజర్ 23 నిమిషాల్లో, భరత్ అనే నేను టీజర్ 29 నిమిషాల్లో, అజ్ఞాతవాసి టీజర్ 30 నిమిషాల్లో, అరవింత సమేత టీజర్ 30 నిమిషాల్లో, మహర్షి టీజర్ 40 నిమిషాల్లో, సైరా టీజర్ 44 నిమిషాల్లో, అల.. వైకుంఠపురములో టీజర్ 47 నిమిషాల్లో 100K లైక్స్ రాబట్టి ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

అల.. వైకుంఠపురములో మూవీ
గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో రూపొందుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తోంది. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











