‘సరిలేరు’ను వెనక్కి నెట్టి.. రికార్డులను వేటాడుతోన్న ‘అల’ టీజర్..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురంలో'. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి ఏ రేంజ్‌లో అలరించాయో.. అంతకు మించి అనేలా తెరకెక్కుతోంది అల వైకుంఠపురములో. దీనికి తగ్గట్టుగా ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు అందర్నీ మెప్పించాయి. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ సైతం సోషల్ మీడియాలో రికార్డులను వేటాడుతోంది.

టీజర్ కోసం వేయి కళ్లతో..
మెగా అభిమాని నూర్ మహ్మద్ మృతితో సోమవారమే రావాల్సిన ఈ టీజర్.. బుధవారం వచ్చింది. నూర్ లాంటి అభిమాని మరణంతో తామెంతో కోల్పోయామని తెలిపిన గీతా ఆర్ట్స్.. అలవైకుంఠపురములో నుంచి ఎలాంటి అప్‌డేట్స్, సంబరాలు లాంటివి జరుపకూడదని టీజర్‌ను వాయిదా వేసేంది. అయినా సరే టీజర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూడసాగారు.

గ్లింప్స్‌తో అంచనాలు..
టీజర్ వాయిదా పడటంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే వారికి కాసింత ఊరటనిచ్చేందుకు టీజర్ గ్లింప్స్ అంటూ స్టైలీష్ స్టార్ లుక్‌ను రివీల్ చేశారు. టీజర్ ఎలా ఉండబోతోందని, చిన్న గ్లింప్స్ ద్వారా తెలియజెప్పేశారు. దీంతో టీజర్‌పై మరింత హైప్ క్రియేట్ అయింది.

టీజర్‌తో త్రివిక్రమ్ మార్క్..
అల వైకుంఠపురములో టీజర్‌తో త్రివిక్రమ్ మార్క్ కనబడుతోంది. ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్, అల్లు అర్జున్ మ్యానరిజం లాంటి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అయితే ఇందులో అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి ఛాయలు కనిపిస్తున్నాయని కామెంట్లు వినిపించినా.. టీజర్ మాత్రం యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.

ఏడు నిమిషాల్లో మిలియన్ వ్యూస్..
టీజర్ విడుదలైన క్షణం నుంచి సోషల్ మీడియాలో వైరల్ కాసాగింది. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్, తెర నిండా భారీ తారాగణం, ఆకట్టుకునే సంగీతం,నేపథ్య సంగీతం ఉండటం, మాస్‌కు కిక్కిచ్చే షాట్ (సిగరెట్ అంటించడం)లతో టీజర్ ఆద్యంతం అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. ఏడు నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్ సాధించి.. ఫాస్టెస్ట్ టీజర్‌గా రికార్డు సృష్టించింది. సరిలేరు నీకెవ్వరు టీజర్ తొమ్మిది నిమిషాల్లో ఈ మార్క్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంసంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది.


Click it and Unblock the Notifications











