'అల..వైకుంఠపురములో' యూఎస్ ప్రీమియర్స్: ఓ రేంజ్ డిమాండ్.. షాకింగ్ నంబర్స్
Recommended Video
అల్లు అర్జున్ తాజా సినిమా 'అల..వైకుంఠపురములో' విడుదలకు సిద్ధమైంది. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పెద్ద సినిమా, పైగా త్రివిక్రమ్- అల్లు అర్జున్ సక్సెస్‌ఫుల్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో జనాల్లో ఆతృత నెలకొంది. ఈ నేపథ్యంలో యూఎస్ ప్రీమియర్స్‌కి భారీ డిమాండ్ ఏర్పడింది.

యూఎస్ ప్రీమియర్స్.. ఎగబడ్డ జనం
అల్లు అర్జున్ సినిమా అంటే ఓవర్సీస్ ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి. ఆయన హీరోగా వచ్చిన ప్రతీ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తుంది. ఈ మేరకు ఎప్పటిలాగే 'అల..వైకుంఠపురములో' సినిమాకు కూడా ఓ రేంజ్ డిమాండ్ నెలకొంది. 'అల..వైకుంఠపురములో' యూఎస్ ప్రీమియర్స్ కోసం అక్కడి జనం ఎగబడ్డారు. దీంతో షాకింగ్ నంబర్స్ నమోదయ్యాయి.

ఎంత కలెక్ట్ చేసిందంటే..
'అల..వైకుంఠపురములో' సినిమాకు చేకూరిన డిమాండ్ మేరకు ఈ సినిమా 300K డాలర్స్ మార్క్ దాటేసింది. ప్రీ సేల్స్ ఇంతలా రావడమంటే ఇది ఎక్స్ట్రాడినరీ అడ్వాన్స్ బుకింగ్ అనే చెప్పుకోవాలి. ఈ బుకింగ్స్‌ని బట్టి చూస్తే.. విడుదలయ్యాక 'అల..వైకుంఠపురములో' సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో దుమ్ముదులపడం ఖాయం అని తెలుస్తోంది.

బ్లూ స్కై సినిమాస్.. ఒక రోజు ముందుగానే
విడుదలకు ఒక రోజు ముందుగానే అనగా జనవరి 11వ తేదీన 'అల..వైకుంఠపురములో' యూఎస్ ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ సినిమాను ఓవర్సీస్ మార్కెట్‌లో బ్లూ స్కై సినిమాస్ సంస్థ వారు విడుదల చేస్తున్నారు.

అల..వైకుంఠపురములో రన్‌టైమ్
ఇటీవలే సెన్సార్ పూర్తిచేసుకున్న 'అల..వైకుంఠపురములో' మూవీ U/A సర్టిఫికెట్ పొందింది. చిత్రం అంతా చాలా క్లాస్‌గా సూపర్ సీన్స్‌తో తెరకెక్కిందని అన్నారట సెన్సార్ సభ్యులు. 2 గంటల 45 నిమిషాల రన్‌టైమ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మ్యూజిక్ లవర్స్‌కి ఆసక్తి.. రికార్డులు బద్దలు
ఇప్పటికే విడుదలైన 'అల..వైకుంఠపురములో' లిరికల్ సాంగ్స్ రికార్డులు బద్దలు కొట్టాయి. థమన్ బాణీలు క్లాస్, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాయి. దీంతో అల.. వైకుంఠపురములో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. మ్యూజిక్ లవర్స్‌కి సినిమాపై ఆసక్తి పెరిగింది.

అల..వైకుంఠపురములో మూవీ
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాగా తెరకెక్కింది 'అల.. వైకుంఠపురములో' మూవీ. అల్లు అర్జున్, పూజ హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు, సుశాంత్, నవదీప్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, నివేద పేతురాజ్, జయరాం, సత్యరాజ్, బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











