'అల.. వైకుంఠపురములో' సంబరాలు.. థియేటర్ల వద్ద ఇదీ పరిస్థితి
అల్లు అర్జున్ తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో' ఈ రోజే (జనవరి 12) విడుదలైంది. అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా కావడంతో భారీ హైప్ నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా చూసేందుకు థియేటర్స్ వద్ద జనం పోటెత్తారు. గంట గంటకూ ప్రేక్షకుల తాకిడి పెరుగుతోంది.
కొన్ని థియేటర్స్‌లో గత అర్ధరాత్రి నుండే అభిమానుల సంబరాలు మొదలైయ్యాయి. ఓవర్సీస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీమియర్ షోస్ పడడంతో థియేటర్స్ దగ్గర అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్, థమన్ భారీ కటౌట్లు ఏర్పాట్లు హంగామా చేశారు ఫ్యాన్స్.ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటూ కొబ్బరి కాయలు కొడుతూ వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ప్రీమియర్స్, ఫస్ట్ షో ద్వారా 'అల.. వైకుంఠపురములో' సినిమాకు పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో సంక్రాంతి రేస్‌లో ఈ సినిమా ఇతర సినిమాలకు గట్టిపోటీ ఇస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత సినిమా 'నా పేరు సూర్య' తో డిసప్పాయింట్ అయిన బన్నీ ఫ్యాన్స్ ఈ సంక్రాంతికి 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ఖుషీ అవుతున్నారు. అన్ని ఏరియాల్లో ఈ సినిమాకు హిట్ టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











