అల్లు అర్జున్ హ్యూజ్ అచీవ్‌మెంట్.. దేశంలోనే తొలిసారిగా! సంబరాల్లో బన్నీ ఫ్యాన్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ హంగామా మామూలుగా లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి సరికొత్త రికార్డులకు తెరలేపారు బన్నీ. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'అల.. వైకుంఠపురములో' మూవీ గత రికార్డులను తిరగరాయడమే గాక.. సరికొత్త ఫీట్స్ అందుకొని తెలుగు సినిమా సత్తా ఏంటో దేశానికి తెలియజేస్తోంది. ఆ వివరాలేంటో చూద్దామా..

లాభాల వేట.. రికార్డుల వేట
సంక్రాంతి బరిలో దిగిన 'అల.. వైకుంఠపురములో' మూవీకి తొలి రోజు నుంచే కలెక్షన్ల వరద మొదలైంది. జనవరి 12వ తేదీన విడుదలైన ఈ సినిమా నేటికీ అదే జోష్ కంటిన్యూ చేస్తూ ''సంక్రాంతి రంకు మొగుడు'' అని ప్రూవ్ చేసుకుంది. ఎక్కడా డ్రాప్ కాకుండా అన్ని ఏరియాల్లో భారీ కలెక్షన్స్ రాబడుతూ లాభాల బాటలో పయనిస్తోంది.

ప్రేక్షకుల చూపంతా 'అల.. వైకుంఠపురములో' థియేటర్ల వైపే
దేశవ్యాప్తంగా 'అల.. వైకుంఠపురములో' మూవీకి వస్తున్న స్పందన రోజురోజుకూ పెరుగుతూ వస్తుండటం గమనార్హం. పోటీగా వచ్చిన ఏ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో ప్రేక్షకులందరూ 'అల.. వైకుంఠపురములో' థియేటర్ల బాట పడుతున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా జోరుమీదుంది. ఈ స్పీడు చూసి అలవోకగా 250-300 కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

కనీవినీ ఎరుగని రికార్డ్.. హ్యూజ్ అచీవ్‌మెంట్
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కనీవినీ ఎరుగని రికార్డ్ సృష్టించబోతున్నారని ప్రముఖ సినీ విశ్లేషకులు రమేష్ బాలా ట్వీట్ చేశారు. హిందీలో డబ్ కాకుండానే ఇండియాలో 200 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిన తొలి సినిమాగా 'అల.. వైకుంఠపురములో' రికార్డు సృష్టించబోతోందని పేర్కొన్నారు. ఇది ఓ హ్యూజ్ అచీవ్‌మెంట్ అని ఆయన తెలిపారు.
బన్నీ ఫ్యాన్స్ రియాక్షన్.. సంబరాల్లో టీమ్
ఈ ట్వీట్ చూసి బన్నీ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డ్స్ చెరిపేస్తూ దూసుకుపోతున్న అల్లు అర్జున్.. ఈ సరికొత్త ఫీట్ అందుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. మరోవైపు చిత్ర దర్శకనిర్మాతలు కూడా ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
Recommended Video

'అల.. వైకుంఠపురములో' మూవీ
గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో అల.. వైకుంఠపురములో మూవీ రూపొందింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టబు, రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి సుశాంత్, నివేతా పేతురాజ్, సునీల్, బ్రహ్మాజీ, నవదీప్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











