'అల.. వైకుంఠపురములో': అర్జున్ రెడ్డి పార్ట్- 2.. వెరీ ఇంట్రెస్టింగ్.. ఇదీ మ్యాటర్
ఈ సంక్రాంతికి స్పెషల్ కిక్ ఇచ్చి 2020కి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పింది 'అల.. వైకుంఠపురములో' మూవీ. రికార్డు లెవెల్ కలెక్షన్స్ రాబట్టి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. అంతేకాదు అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి బన్నీ అభిమానులను ఖుషీ చేసింది.
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ టేకింగ్, హీరో హీరోయిన్లు అల్లు అర్జున్- పూజా హెగ్డే కెమిస్ట్రీ, థమన్ బాణీలు దేనికవే ప్రత్యేకంగా నిలిచాయి. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇటీవలే 50 రోజులు పూర్తిచేసుకున్న ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పై కూడా సత్తా చాటుతోంది. ఇప్పటికీ 'అల.. వైకుంఠపురములో' ట్రాన్స్ నుంచి బయటకు రాలేకపోతున్నారు జనం.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ డిలీటెడ్ సీన్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సీన్‌లో అల్లు అర్జున్, సుశాంత్ కనిపించారు. సుశాంత్‌కు సంబంధించిన సీక్రెట్‌ను బన్నీ తెలుసుకుని, అతడికి ఆటపట్టించడం తాలూకు సీన్ ఇది. అర్జున్ రెడ్డి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను వాడటం, అల్లు అర్జున్ నోట అర్జున్ రెడ్డి పార్ట్- 2 అనే పదం రావడంతో ఈ సీన్ చాలా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ సీన్ నెట్టింట వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











