మరో న్యూ రికార్డ్ అందుకున్న అల్లు అర్జున్.. ఇప్పట్లో ఆ గోల తగ్గేలా లేదు
ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో అల.. వైకుంఠపురములో ఒకటి. కేవలం టాలీవుడ్ అనే కాకుండా అత్యంత క్రేజ్ అందుకున్న సౌత్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ మూవీ స్టైలిష్ స్టార్ మార్కెట్ ని కూడా భారీ స్థాయిలో పెంచేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.
ఇక సినిమాలోని పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రాములో రాములో సాంగ్ తో పాటు సామజవరగమన పాట కూడా యూ ట్యూబ్ లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఇప్పుడు బుట్టబొమ్మ వీడియో సాంగ్ కూడా 250మిలియన్ వ్యూవ్స్ అందుకొని యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇప్పటికే రాములో రాములో సాంగ్ 284మిలియన్ వ్యూవ్స్ తో దూసుకుపోతోంది. ఇక సామజవరగమన కూడా 200మిలియన్ వ్యూవ్స్ కి దగ్గరలో ఉంది. ఇప్పుడు బుట్ట బొమ్మ సాంగ్ సైతం 250M మార్క్ ని అందుకోవడంతో తెలుగులో అత్యధిక వీడియో సాంగ్ వ్యూవ్స్ అందుకున్న సినిమాగా అల..వైకుంఠపురములో నిలుస్తోంది. ముందుముందు ఇంకా ఈ సాంగ్స్ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తాయో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











