twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చరిత్ర సృష్టిస్తుందని చిరంజీవి గారు అప్పుడే చెప్పాడు.. అందుకే ఆయన మెగాస్టార్

    |

    "ఈ సినిమా ఇంత బాగా చేస్తుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఒక్కరే ఈ సినిమాని ప్రివ్యూ థియేటర్లో చూశారు. ఈ సినిమా ఈ స్థాయిలో ఉంటుందని ఆ రోజే ఆయన చెప్పేశారు" అని చెప్పారు స్టైల్ష్ స్టార్ అల్లు అర్జున్. సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తూ 'నాన్ బాహుబలి' రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో అల్లు అర్జున్, త్రివిక్రమ్, నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులతో వారి సంభాషణ...

    ఇండస్ట్రీ హిట్టయినందుకు ఎలా ఫీలవుతున్నారు?

    ఇండస్ట్రీ హిట్టయినందుకు ఎలా ఫీలవుతున్నారు?

    ఇండస్ట్రీ హిట్ అని ప్రొడ్యూసర్స్ ఎనౌన్స్ చేశారు. ఇది నా విక్టరీ కాదు. ఇది జనం నాకిచ్చిన ఒక అప్రిసియేషన్ టోకెన్. ఇది నేను ఎంత సంపాదించుకున్నాను అనేది కాదు. ఒక సినిమా రికార్డు వచ్చినప్పుడు అది హీరో ర్యాంకు కాదు. జనం ఆ సినిమాకి ఇచ్చిన ర్యాంకు. టాప్ టెన్ రికార్డ్స్ తీసుకుంటే ఆ సినిమాల్లో ఏ హీరో ఉంటే ఆ హీరోకి ఆ ర్యాంక్ అనేది కాదు. జనం ఆ సినిమాని అంతగా ఇష్టపడ్డారు అని అర్థం. జనం ఆ స్థాయిలో ఆ సినిమాను ఇష్టపడినందుకు నాకు అమితమైన ఆనందం అందులోనూ అది నా సినిమా అవటం అయాం వెరీ వెరీ హ్యాపీ.

    నాన్-బాహుబలి రికార్డు అని పెట్టడానికి కారణం ఏంటి?

    నాన్-బాహుబలి రికార్డు అని పెట్టడానికి కారణం ఏంటి?

    అల్లు అరవింద్: మీరు చెప్పింది కరెక్ట్. ఇది చాలా చోట్ల 'బాహుబలి 2' తర్వాత వచ్చి ఆగింది. బాహుబలి అనేదాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ మాట అని ఉండొచ్చు. కలెక్షన్ల గురించి హీరోకు, డైరెక్టరుకు తెలియకపోవచ్చు. ఎందుకంటే రోజు ఫిగర్లు చూసుకొని ఆనంద పడేది మేము. సినిమా ఎంత బాగా వచ్చింది అని చూసుకొని వాళ్లు ఆగిపోతారు. ఎంత బాగా వసూలు అవుతుందనేది చూసుకునే దగ్గర మేము మొదలవుతాం. యూఎస్ లో టాప్ త్రీలో ఉంది. త్వరలో నెక్స్ట్ బాహుబలికి వెళ్లే అవకాశం ఉంది. అక్కడ ఇంకా కలెక్ట్ చేస్తోంది.

     చాలా రోజుల తర్వాత రికార్డ్స్ గురించి...

    చాలా రోజుల తర్వాత రికార్డ్స్ గురించి...

    అల్లు అర్జున్: ప్రతి హీరోకి ఏదో ఒక టైంలో ఒక రికార్డు ఫిలిం పడుతూ ఉంటుంది. నాకు ఇదివరకు ఒక రికార్డు ఫిలిం పడింది కానీ ఓవరాల్ గా అన్నిచోట్ల పడలేదు. అన్ని జిల్లాల్లో యునానిమస్ గా ఆల్టైమ్ రికార్డు ఎప్పుడూ పడలేదు. నాన్నకు గీతా ఆర్ట్స్ లో దాదాపు 10 ఆల్టైమ్ రికార్డు సినిమాలు పడ్డాయి. చిరంజీవిగారితో చాలా సినిమాలు, గజినీ, మగధీర వంటి సినిమాలు పడ్డాయి. రికార్డ్స్ ఆయనకు కొత్త విషయం కాదు. నాన్న గారితో ఫస్ట్ టైం ఆల్ టైమ్ రికార్డు ఒక కొడుకుగా కొట్టడం సంతోషంగా ఉంది. దట్ ఈజ్ ఆల్వేస్ మెమరబుల్. మళ్ళీ మేము ఇంకోసారి రికార్డు కొట్టొచ్చు కానీ ఇంత ఆనందం రాదు. దిస్ ఈజ్ వెరీ వెరీ వెరీ స్పెషల్. ఐ ఆల్వేస్ చెరిష్ ఇట్. మా ఫాదర్ తో రికార్డు కొట్టాలని ఎప్పటినుంచో కోరిక. దీనికి కారణమైన అందరికీ మరోసారి థాంక్స్. ప్రత్యేకించి త్రివిక్రమ్ గారికి.

    త్రివిక్రమ్ ఈ కథ మీకు చెప్పినప్పుడు...

    త్రివిక్రమ్ ఈ కథ మీకు చెప్పినప్పుడు...

    అల్లు అర్జున్: మనం ఎవరికైనా స్థానం ఇవ్వగలం కానీ స్థాయిని ఇవ్వలేమని ఈ సినిమాలో ఆయన ఒక డైలాగ్ రాశారు. అది ఆబ్సొల్యూట్లీ ట్రూ. నిజంగానే ఈ సినిమాతో అంత స్థానం వచ్చింది. ఆ స్థాయికి తగ్గట్టు నేను ఈ ప్రయాణం నడిపించాలని అనుకుంటున్నాను. ఈ సినిమా ఇంత చేస్తుందని నాకు తెలియదు. ఏ సినిమాకీ తెలియదు, ఎవరు చెప్పలేరు. ఈ సినిమాకి మనం బెస్ట్ చేయాలని నేను పని మాత్రం చేశాను. జనాలు దాన్ని అప్రిషియేట్ చేసి దాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు. ఇందులో నా క్రెడిట్ ఉందంటే మాత్రం అది అబద్ధం. త్రివిక్రమ్ గారు చెప్పిన వెంటనే ఇది గోల్డ్ మైన్ అవుతుందని మాత్రం ఇది నేను చేయలేదు. ఆయన ఒక మంచి కథ చెప్పారు, నాకు నచ్చింది. మేమిద్దరం సరదాగా ఒక హ్యాపీ సినిమా చేయాలనుకున్నాం. మేము మా పని చేశాం. అది జనానికి వచ్చింది.

    ఈ సినిమా సక్సెస్‌లో ఎవరికి ఎంతంటే

    ఈ సినిమా సక్సెస్‌లో ఎవరికి ఎంతంటే

    అల్లు అర్జున్: హానెస్ట్ గా చెప్పాలంటే దాని విడదీసి చెప్పలేం. చూసిన వాళ్ళలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, జనరల్ ఆడియెన్స్ ఎంతమంది ఉన్నారు అనేది చెప్పలేం. మా కనెక్షన్ లో లేని ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. ఫ్యాన్స్ అంటే గొడవ చేసే వాళ్ళు బ్యానర్లు కట్టే వాళ్ళు కాదు. కామ్ గా, అడ్మైరింగ్ గా ఉండే వాళ్ళు కూడా ఫ్యాన్స్ కిందే లెక్క. ఎంతమంది ఫ్యాన్స్ కి నచ్చింది, ఎంత మంది అడ్మైరర్స్ కి నచ్చింది, ఎంతమంది కామన్ పీపుల్ కి నచ్చింది అనేది విడదీసి చెప్పలేం. ఒకటి మాత్రం ఖాయం. ఫ్యాన్ అయినా నాన్ ఫ్యాన్ అయినా, సినిమా నచ్చితే స్టుపెండస్ సక్సెస్ చేస్తారు. అందరికీ సినిమా నచ్చింది. థాంక్యూ వెరీ మచ్ ఫర్ దట్‌.

     ఈ సక్సెస్ క్రెడిట్ మీరు ఎక్కువగా ఎవరికి ఆపాదిస్తారు?

    ఈ సక్సెస్ క్రెడిట్ మీరు ఎక్కువగా ఎవరికి ఆపాదిస్తారు?

    అల్లు అర్జున్: సినిమా అనేది ఎంటైర్ టీం వర్క్. ఒకరి పేరు చెప్పాల్సి వస్తే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. నిజానికి నేను 'నా పేరు సూర్య' చేసిన తర్వాత వక్కంతం వంశీ గారు, నేను, బన్నివాసు కలిసి ఉన్నప్పుడు ఎవరితో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నప్పుడు వక్కంతం వంశీ గారు త్రివిక్రమ్ గారి పేరు సూచించారు. ఆయనతో కలిసి చేస్తే బాగుంటుంది అని ఆయన చెప్పారు. ఆయన మాటల్లో ఒక పల్స్ కనిపించింది. నా మైండ్ లో ఆయనే త్రివిక్రమ్ తో గారితో చేయాలని ఐడియా వేశారు.

    Recommended Video

    Allu Arjun Unbelievable Craze In Vizag
    మూవీ చూసిన తర్వాత చిరంజీవి, రాంచరణ్

    మూవీ చూసిన తర్వాత చిరంజీవి, రాంచరణ్

    అల్లు అర్జున్: చిరంజీవి గారు చాలా ఆనందపడ్డారు. ఈ సినిమా ఇంత బాగా చేస్తుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఒక్కరే ఈ సినిమాని ప్రివ్యూ థియేటర్లో చూశారు. ఈ సినిమా ఈ స్థాయిలో ఉంటుందని ఆ రోజే ఆయన చెప్పేశారు. 'మీకు ఎక్కువగా నచ్చి అలా అంటున్నారేమో' అని నేను అన్నాను. 'లేదు లేదు నాకు తెలిసి పోతుంది, ఒక సినిమా ఏ లెవల్లో ఉంటుందనేది' అని చెప్పారు. అలా చెప్పటం అంత ఈజీ కాదు. తను ఒక్కరే చూసినా ఎంత పీపుల్ పల్సులో ఆయన ఉన్నారో నాకు అర్థమైంది. ఒక సినిమా చూసి ఇది ఎంత చేస్తుంది అని చెప్పడానికి ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి! హి ఈజ్ రియల్లీ గ్రేట్. త్రివిక్రమ్: మేమిద్దరం అయితే షాక్ తిన్నాం. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఆ మాట అన్నారేమో అనుకున్నాను. రామ్ చరణ్ నాతో మాట్లాడారు.

    English summary
    Stylish Star Allu Arjun's Ala vaikunthapurramuloo making rampage at box office. Allu Arjun entered first time in Rs.100 crores club. Now its become industry hit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X