Don't Miss!
- News తెలంగాణలో వచ్చే రెండు రోజులు వానలు: ఆ తర్వాత తీవ్రమైన ఎండలు, ఎల్లో అలర్ట్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అల వైకుంఠపురములో ట్విస్ట్.. అందుకే ఆ రెండింటిలో.. మోసం చేశారంటూ ఫైర్
తెలుగునాట ఈ మధ్య అల వైకుంఠపురములో చిత్రం చేసినంత హల్చల్, హంగామా మరే చిత్రం చేయలేదేమో. పాటలేమో సోషల్ మీడియాలో రికార్డులను క్రియేట్ చేసుకుంటూ పోతే.. సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను వేటాడారు. అల వైకుంఠపురుములో ధాటికి మరే చిత్రం నిలవలేకపోయింది. నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కొన్ని చోట్లైతే ఏకంగా బాహుబలి 1 రికార్డుకే ఎసరు పెట్టేసింది. ఇక అల వైకుంఠపురములో థియేటర్లలో చేసే సందడి తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే డిజిటిల్ ఫ్లాట్ఫామ్లోకి అల వచ్చేసింది.
పాటలతో మొదలైన ప్రభంజనం..
ఎప్పుడైతే సామజవరగమన విడుదలైందో.. ఆ క్షణం నుంచి అల వైకుంఠపురములో రేంజ్ మారిపోయింది. ఇక వరుసగా రాములో రాముల, బుట్టబొమ్మ, ఓ మై గాడ్ , టైటిల్ సాంగ్ ఇలా ప్రతీ ఒక్కటి అంచనాలు పెంచేసుకుంటూ పోయాయి. దశాబ్దపు ఆల్బమ్‌గా, దశాబ్దపు పాటగా కీర్తించే స్థాయికి ఎదిగిపోయాయి.
ఎట్టకేలకు బన్నీ ఇండస్ట్రీ హిట్..
కెరీర్లో దాదాపు ఇరవై చిత్రాలు చేస్తే గానీ ఒక్క ఇండస్ట్రీ హిట్ కొట్టలేకపోయాడు బన్నీ. అదే తనకు కూడా వెలితిలా ఉందని, అయితే అల వైకుంఠపురములో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు బన్నీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 130కోట్లకు పైగా షేర్ రాబట్టి.. మిగతా హీరోల రికార్డులన్నీ బద్దలు కొట్టేశాడు.
అందులో మాత్రమేనని..
అల వైకుంఠపురములో చిత్ర హక్కులు సన్ నెట్వర్క్స్ చేజిక్కించుకుంది. ఈ క్రమంలో జెమినీ టీవీ, సన్ నెక్ట్స్‌లో మాత్రమే ప్రసారమవుతుందని మొదట ప్రకటించారు. యూఎస్ ప్రీమియర్స్‌లోనే అలాగే వేశారట. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి మాధ్యమాల్లో ప్రసారం కాదని ప్రచురించారట. తీరా చూస్తే అది నెట్‌ఫ్లిక్స్‌లోనూ ప్రత్యక్షమైంది.
అందుకే అలా చేశాం..
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లో రాదని చెప్పి.. థియేటర్లకు రప్పించడానికే అలా ప్లాన్ చేశారా? అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే సన్ నెక్ట్స్ ఎక్కువగా రీచ్ లేకపోవడంతో.. వారివురు ఒప్పందం మేరకు నెట్‌ఫ్లిక్స్‌లోనూ ప్రసారం చేశారట. సన్ నెక్ట్స్‌కు ఉన్న మెంబర్స్ తక్కువ కావడం, ప్రపంచ వ్యాప్తంగా అంత రీచ్ లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.