ఆరు నెలలుగా మానసికంగా.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కారణంగా.. మొత్తం చెప్పేసిన థమన్

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' మూవీ ఇటీవలే విడుదలై సూపర్ సక్సెస్ సాధించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేదికపై మాట్లాడిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. వివరాల్లోకి పోతే..

 వైజాగ్‌లో విజయోత్సవ సభ.. అభిమానుల కోలాహలం

వైజాగ్‌లో విజయోత్సవ సభ.. అభిమానుల కోలాహలం

'అల.. వైకుంఠపురములో' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం విశాఖను వేదికగా చేసుకుంది చిత్రయూనిట్. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు అల్లు అర్జున్ సహా చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున బన్నీ అభిమానులు హాజరు కావడంతో వేదిక ప్రాంగణం కోలాహలంగా కనిపించింది.

సినిమాకు ప్రధాన బలం.. తెరవెనుక థమన్

సినిమాకు ప్రధాన బలం.. తెరవెనుక థమన్

అల.. వైకుంఠపురములో సక్సెస్‌లో థమన్ కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా మారింది. తెరపై నటీనటుల అభినయం ఒకెత్తయితే, తెరవెనుక థమన్ పడిన కష్టం.. అందించిన బాణీలు మరో ఎత్తయ్యాయి. విడుదలకు ముందే ఈ సినిమా పాటలు టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించాయి.

ఎలా గెలవాలని ఆరు నెలలుగా..

ఎలా గెలవాలని ఆరు నెలలుగా..

ఈ మేరకు సక్సెస్ మీట్‌లో మాట్లాడిన థమన్.. "జనవరికి ఎలా గెలవాలని ఆరు నెలలుగా మానసికంగా పరిగెత్తుతూ వచ్చాం. దాంతో బ్రెయిన్ కొంచెం చిక్కిపోయింది. బన్నీ, త్రివిక్రమ్ వల్లే ఈ ఆల్బం ఇలా వచ్చింది. ఈ భూగ్రహం పైనే కూలెస్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్. పదేళ్ల కాలంలో వంద సినిమాలు చేశాను. త్రివిక్రమ్ గారితో పనిచేయడానికి నాకు పదేళ్లు పట్టింది. అందుకే పదేళ్లు మించిపోయే పాట ఇచ్చాను'' అన్నారు.

బన్నీతో హ్యాట్రిక్.. అది మరీ కష్టం

బన్నీతో హ్యాట్రిక్.. అది మరీ కష్టం

సాధారణంగా ఒక దర్శకుడితో పరిగెత్తడం కష్టం. అదే రైటర్ కూడా అయిన దర్శకుడితో పరిగెత్తడం మరీ కష్టం. 'రేసుగుర్రం', 'సరైనోడు', ఇప్పుడు ఈ సినిమాతో బన్నీతో హ్యాట్రిక్ సాధించాను. సాధారణంగా సైకిల్ ట్యూబులు పంక్చరవడం మనం చూస్తుంటాం. ఈ సినిమాకి యూట్యూబులే పంక్చరయ్యాయి అన్నారు థమన్.

త్రివిక్రమ్.. ఒకే ఒక సోల్జర్

త్రివిక్రమ్.. ఒకే ఒక సోల్జర్

ఇండియాని కాపాడ్డానికి బోర్డర్లో ఆర్మీవాళ్లు ఉంటారు. కానీ మన తెలుగు భాషను కాపాడే ఒకే సోల్జర్ త్రివిక్రమ్ గారు. ఆయన అమ్మలాంటి మనిషి. ఆయనను జాగ్రత్తగా కాపాడుకుందాం. నిర్మాతలు రాధాకృష్ణ, అరవింద్ గార్లు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. వంద మిలియన్ కాదు వెయ్యి మిలియన్ వ్యూస్ కొడతాం అని తెలిపారు థమన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X