twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల.. వైకుంఠపురములో: వాళ్లిద్దరూ పూనుకొనే ఇలా చేశారు.. బ్రహ్మానందం కామెంట్స్

    |

    అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అల.. వైకుంఠపురములో'. జనవరి 12న విడుదలైన ఈ సినిమా తొలి షో తోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ సంక్రాంతి విన్నర్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో థాంక్స్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేదికపై మాట్లాడిన బ్రహ్మానందం అల్లు ఫ్యామిలీపై కామెంట్స్ చేశారు. వివరాల్లోకి పోతే..

    హింట్ ఇస్తూ బ్రహ్మానందం స్పీచ్..

    హింట్ ఇస్తూ బ్రహ్మానందం స్పీచ్..

    రాములో రాములా పాట హిట్ అయ్యిందంటే కారణం నేనే అని హింట్ ఇస్తూ తన స్పీచ్ స్టార్ట్ చేశాడు బ్రహ్మానందం. తనకు హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు వచ్చిన బన్నీ.. నా సినిమాలో మొదటి మీరు చేస్తున్నారని అన్నాడు. ఆ తరువాత అదే మాట త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు అని తెలిపారు బ్రహ్మానందం.

    అనారోగ్యంతో ఉన్నా కాబట్టి.. ఎలా పూనుకున్నారో తెలియదు కానీ

    అనారోగ్యంతో ఉన్నా కాబట్టి.. ఎలా పూనుకున్నారో తెలియదు కానీ

    అయితే అనారోగ్యంతో ఉన్నా కాబట్టి ఏదో మాట వరుసకు అలా అన్నారులే అని నేను ఊరుకున్నా. మరోవైపు 'అల.. వైకుంఠపురములో' పూర్తవుతోంది. ఇంతలో ఈ ఇద్దరూ కూర్చొని ఏం మాట్లాడుకున్నారో, ఎలా పూనుకున్నారో తెలియదు కానీ.. నాకు సినిమాలో ఛాన్స్ ఇచ్చారు అని తెలిపారు బ్రహ్మానందం.

    అలాంటి వ్యక్తులే బన్నీ అండ్ త్రివిక్రమ్

    అలాంటి వ్యక్తులే బన్నీ అండ్ త్రివిక్రమ్

    ఏదేమైనా బన్నీ అండ్ త్రివిక్రమ్ ఇచ్చిన మాటను ఎలాగైనా నిలుపుకునే వ్యక్తులని వారిని కొనియాడారు బ్రహ్మానందం. మాట నిలుపుకునే ఈ తత్వం బన్నీకి మా గురువు గారు అల్లు రామలింగయ్య గారి నుంచి వచ్చిందని బ్రహ్మానందం పేర్కొన్నారు. ఈ సందర్బంగా అల్లు రామలింగయ్య జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు బ్రహ్మానందం.

    ఏదేమైనా ఆనందంగా ఉంది

    ఏదేమైనా ఆనందంగా ఉంది

    త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ.. అవలీలగా ఎలాంటి డైలాగ్ అయినా రాయగలడు ఆయన. సరస్వతి ఆయన నాలుకపై నాట్యమాడుతుందేమో అనిపిస్తోంది. అలాంటి గ్రేట్ డైరెక్టర్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం ఆనందంగా ఉందని బ్రహ్మానందం అన్నారు. ఈ సందర్బంగా చిత్రయూనిట్ మొత్తానికి పేరు పేరునా అభినందనలు తెలియజేశారు బ్రహ్మానందం.

    అల.. వైకుంఠపురములో మూవీ

    అల.. వైకుంఠపురములో మూవీ

    త్రివిక్రమ్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టబు, రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి సుశాంత్, నివేతా పేతురాజ్, సునీల్, బ్రహ్మాజీ, నవదీప్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించారు.

    English summary
    Allu Arjun, Trivikram Srinivas hatric movie Ala vaikunthapurramuloo. This movie released and getting good responce. Now unit organised thank you meet. In this event Brahmanandam commented Allu Arjun and Trivikram Srinivas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X