'అల.. వైకుంఠపురములో' రెస్పాన్స్.. ఈ ఇద్దరే స్పెషల్.. వాళ్ళే అసలు హీరోలు!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంక్రాంతి బరిలోకి దిగేశారు. తమ కాంబోలో తెరకెక్కిన హాట్రిక్ మూవీ 'అల.. వైకుంఠపురములో'ను ప్రేక్షకుల ముందుంచారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజే (జనవరి 12) రిలీజ్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్, పలుచోట్ల ప్రీమియర్స్ చూసిన జనం ఓ ఇద్దరి గురించి స్పెషల్‌గా చెప్పుకుంటున్నారు. ఆ వివరాలేంటో చూద్దామా..

'అల.. వైకుంఠపురములో' అప్పుడే హ్యూజ్ రెస్పాన్స్
'అల.. వైకుంఠపురములో' సినిమా షూటింగ్ చేస్తూనే త్రివిక్రమ్ మార్క్ ప్రమోషన్స్ చేసి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. ఇచ్చిన ప్రతీ అప్‌డేట్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చేలా జాగ్రత్తపడి ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన లిరికల్ సాంగ్స్, థమన్ మ్యూజిక్ ప్రేక్షకలోకాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.

రెగ్యులర్ పంథా.. త్రివిక్రమ్ ఫార్ములా
త్రివిక్రమ్ సినిమా అంటేనే ఓ వెరైటీ స్టోరీ, సూపర్ డైలాగ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో 'అల.. వైకుంఠపురములో' సినిమాకి కూడా ఆయన అదే ఫార్ములా ఫాలో అయ్యారని తెలుస్తోంది. చిత్రంలో పంచ్ డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయనే టాక్ వస్తోంది. మరీ ముఖ్యంగా ఆ ఇద్దరే అసలు హీరోలు అనే టాక్ వినిపిస్తోంది.

తెరవెనుక హీరోలు.. థమన్ మ్యాజిక్
ఆడియన్స్ అంత ప్రత్యేకంగా చెప్పుకుంటున్న ఆ ఇద్దరు హీరోలు తెరవెనుకే ఉన్నారు. వాళ్ళే ఒకరు సినిమాటోగ్రాఫర్ పి.ఎస్ వినోద్ కాగా మరొకరు మ్యూజిక్ డైరక్టర్ ఎస్.థమన్. రిలీజ్ ముందే థమన్ మ్యూజిక్ మ్యాజిక్ చేయగా, రిలీజ్ తర్వాత కెమెరామెన్ వినోద్ టాలెంట్ బయటపడిందని జనం అంటున్నారు. సినిమా చాలా అందంగా తీర్చిదిద్దడంలో కెమెరామెన్ పి.ఎస్ వినోద్ కృషి ఉందని అంటున్నారు.

అల్లు అర్జున్ స్టైలిష్ లుక్.. ఎమోషనల్ రోల్
మొత్తానికి 'అల వైకుంఠపురములో' ఫస్ట్‌టాక్ బట్టి చూస్తే సినిమా అంచనాలకు రీచ్ అయ్యిందని తెలుస్తోంది. అల్లు అర్జున్ స్టైలిష్ లుక్, హీరోయిన్ పూజా హెగ్డేతో ఆయన కెమిస్ట్రీ అదిరిందని టాక్ వస్తోంది. అలాగే సినిమాలో ఎమోషన్స్ బాగా పండాయని, బన్నీ కెరీర్‌లోనే ఇప్పటివరకు ఇంత వెయిట్ ఉన్న ఎమోషనల్ రోల్ చేయలేదని టాక్ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











