అప్పుడే స్టార్ట్ చేసేశారుగా.. అల్లు అర్జున్ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ స్పీడ్ పెంచేశారు. తమ తమ అభిమానులకు సర్‌‌ప్రైజ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చేశారు. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న కొత్త సినిమా 'అల.. వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు త్రివిక్రమ్.

ఈ మేరకు ఇప్పటికే చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి ఆసక్తి రేకెత్తించిన మాటల మాంత్రికుడు.. చిత్రంలోని మొదటి పాట 'సామజవరగమన' సాంగ్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఈ మేరకు సెప్టెంబర్ 28వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ మెలోడీ సాంగ్‌కి సంబంధించి 20 సెకనుల వీడియోను ఒక రోజు ముందే విడుదల చేసి ఆ తరువాత ఫుల్ సాంగ్ విడుదల చేసేలా స్కెచ్ వేశారు త్రివిక్రమ్.

Ala Vaikutapuramlo Samajavaragamana Song update

సీతారామ శాస్త్రి అందించిన లిరిక్స్‌పై సిద్ శ్రీరామ్ 'సామజవరగమన' పాటను ఆలపించగా తమన్ సంగీతం అందించారు. ఎంతో వినసొంపుగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో ఈ సాంగ్ పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది.

వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతున్న అల.. వైకుంఠపురములో చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఇటు త్రివిక్రమ్ అభిమానులు, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అల్లు అర్జున్ కెరీర్‌లో 19వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X