దూసుకుపోతున్న అల్లు అర్జున్.. మెలోడీకే ఇలా ఉంటే ఇక మాస్ బీట్ వచ్చిందంటే!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా 'అల.. వైకుంఠపురములో'. గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే 'సామజవరగమన' సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. విడుదలైన రోజు నుంచే ఈ సాంగ్ వేగంగా వ్యూస్ రాబడుతూ అరుదైన రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది.
ఇప్పటిదాకా ఈ పాట సోషల్ మీడియాలో 33 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసింది. దీంతో మెలోడీకే ఇలా ఉంటే ఇక మాస్ బీట్ వచ్చిందంటే మోగిపోతుందని అంటున్నారు బన్నీ అభిమానులు. 'సామజవరగమన' అంటూ సాగే ఈ మెలోడీ పాటను సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించగా తమన్ సంగీతం అందించారు. సీతారామ శాస్త్రి అందించిన లిరిక్స్ పాటకు ప్రాణం పోశాయి. ఈ మేరకు చిత్రయూనిట్‌కి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశాడు సింగర్ సిద్ శ్రీరామ్.

అల్లు అర్జున్ స్పెషల్ కేర్ తీసుకొని షూటింగ్ చేస్తున్న 'అల.. వైకుంఠపురములో' చిత్రంలో ఆయన సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఇటు త్రివిక్రమ్ అభిమానులు, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జనవరి 12వ తేదీన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుంచనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.
ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు త్రివిక్రమ్. అల్లు అర్జున్ కెరీర్‌లో 19వ సినిమాగా రాబోతున్న అల.. వైకుంఠపురములో చిత్రంలో అల్లు అర్జున్ రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడని, ఆయన డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడనే వార్త ప్రచారంలో ఉంది.


Click it and Unblock the Notifications











