తెలుగు చిత్రసీమలోనే సరికొత్త సంచలనం.. రికార్డ్స్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త సంచలనానికి నాంది పలికారు. తెలుగు చిత్రసీమలోనే గతంలో ఎన్నడూ ఎవ్వరూ సాధించని ఫీట్ సాధించి మెగా శిబిరంలో సంబరాలు నింపారు. ఆయన నటిస్తున్న తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో' అప్‌డేట్ ద్వారానే బన్నీ ఈ మైలురాయిని చేరారు. ఇంతకీ ఏంటా అప్‌డేట్? ఏంటా రికార్డ్? వివరాల్లోకి పోతే..

త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్

త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా 'అల.. వైకుంఠపురములో'. గీతా ఆర్ట్స్ బ్యానర్‌, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే 'సామజవరగమన' సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. విడుదలైన రోజు నుంచే ఈ సాంగ్ వేగంగా వ్యూస్ రాబడుతూ అరుదైన రికార్డుల దిశగా పరుగులు పెట్టింది.

మరో మెట్టెక్కిన బన్నీ.. ఆ కారణం గానే

మరో మెట్టెక్కిన బన్నీ.. ఆ కారణం గానే

'సామజవరగమన' అంటూ సాగే ఈ మెలోడీ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించగా తమన్ సంగీతం అందించారు. సీతారామ శాస్త్రి అందించిన లిరిక్స్‌ పాటకు ప్రాణం పోశాయి. తెలుగు ప్రేక్షకులను, మరీ ముఖ్యంగా మెగా అభిమానులను ఎంతగానో అలరించింది ఈ సాంగ్. తాజాగా ఇదే పాట సరికొత్త రికార్డు నమోదు చేసి బన్నీని మరో మెట్టు పైన నిలబెట్టింది.

రికార్డు బ్రేక్ చేస్తూ.. తెలుగు చిత్రసీమలో ఎన్నడూ లేని విధంగా

రికార్డు బ్రేక్ చేస్తూ.. తెలుగు చిత్రసీమలో ఎన్నడూ లేని విధంగా

ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న 'సామజవరగమన' సాంగ్ పలు రికార్డులకు బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఈ సాంగ్ ఓ సెన్సేషనల్ ఫీట్ అధిగమించింది. సోషల్ మీడియాలో 1 మిలియన్ లైక్స్ పొందిన తొలి వీడియోగా రికార్డు నమోదు చేసింది. తెలుగు చిత్రసీమలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఫీట్ సాధించింది 'సామజవరగమన' సాంగ్.

ఆనందంతో అల్లు అర్జున్..

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా 'సామజవరగమన' సాంగ్ రికార్డు వివరాలు తెలుపుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు అల్లు అర్జున్. ''మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. ఈ సాంగ్ మేకింగ్ లో భాగమైన ప్రతీ వ్యక్తికి నా హృదయపూర్వక ధన్యవాదాలు'' అని తెలిపారు బన్నీ.

Recommended Video

#CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
బన్నీ స్పెషల్ కేర్.. అభిమానుల్లో ఆత్రుత

బన్నీ స్పెషల్ కేర్.. అభిమానుల్లో ఆత్రుత

అల్లు అర్జున్ స్పెషల్ కేర్ తీసుకొని షూటింగ్ చేస్తున్న 'అల.. వైకుంఠపురములో' చిత్రంలో ఆయన సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఇటు త్రివిక్రమ్ అభిమానులు, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. జనవరి 12వ తేదీన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుంచనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X