Alekhya Chitti Pickles : చావు బతుకుల్లో అలేఖ్య చిట్టి .. ఐసీయూలో క్రిటికల్‌‌గా కండీషన్

అలేఖ్య చిట్టి.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ తర్వాత పచ్చళ్ల బిజినెస్‌తో ఫేమస్ అయ్యారు అలేఖ్య చిట్టీ సిస్టర్స్. మంచి టేస్ట్‌, క్వాలిటీతో వినియోగదారుల నమ్మకం పొందిన వీరు తర్వాత నోటి దురుసుతో చివరికి వ్వాపారమే మూసివేసే పరిస్థితి తెచ్చుకున్నారు. కేవలం నోటి దురుసు వీరికి కష్టాలను తెచ్చిపెట్టింది. వ్యాపారం పోవడంతో పాటు ఇంటా బయటా విమర్శలను ఎదుర్కొంటున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లు. సుమ, అలేఖ్య, రమ్య కంచర్ల. వీరిలో రమ్యకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది . హాట్ హాట్ డ్రెస్సుల్లో ఈవిడ చేసే రీల్స్‌ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ రోజున తాము అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో పచ్చళ్ల వ్యాపారం చేస్తున్నామని, అందరూ తమను ఆదరించాలని అనౌన్స్ చేసింది. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు ఇలా నాన్ వెజ్‌తో చేసే పచ్చళ్లకు ఈ సిస్టర్స్ మంచి పేరు తెచ్చుకున్నారు. పచ్చళ్ల అమ్మకాలతో పాటు పికెల్స్ తయారీ, కలిపే విధానానికి సంబంధించిన వివరాలు కూడా ఎప్పటికప్పుడు పంచుకుంటూ వస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు.

alekhya chitti pickles controversy alekhya hospitalized due to breathing issues says suma kancharla

కస్టమర్ల ఆదరణ బాగుండటంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా సాగుతోంది. వ్యాపారం అన్నాక కస్టమర్లు బేరసారాలు సాగించడం కామన్. కానీ ఇటీవల ఓ వినియోగదారుడితో అలేఖ్య చిట్టి జరిపిన సంభాషణ దుమారం రేపింది. పచ్చళ్ల రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయని వాటిని అందరికీ అందుబాటు ధరల్లో ఉంచాలని ఓ వ్యక్తి కోరాడు. దీనికి సాధారణంగా వ్యాపార భాషలో చెబితే సరిపోయేది.. కానీ అలేఖ్య చిట్టి మాత్రం అసభ్యకరంగా దూషించింది. పచ్చళ్లే కొనలేని వాడివి రేపు భార్యకు బంగారం ఏం కొంటావ్, ముందు కెరీర్‌పై ఫోకస్ పెట్టు అని మాట్లాడింది. వీరిద్దరి సంభాషణ తాలుకూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ దెబ్బతో నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. వ్యాపారం చేయాల్సింది ఇలాగేనా? ముందు కస్టమర్లను గౌరవించడం నేర్చుకోమంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ట్రోలింగ్ దెబ్బతో దిగొచ్చిన అలేఖ్య చిట్టి సిస్టర్స్ సంజాయిషీ ఇచ్చారు. ఎవరికో పెట్టాల్సిన రిప్లయ్ , పొరపాటున అతనికి వెళ్లిందని కవర్ చేసుకోవడానికి ట్రై చేశారు. వివాదం ఇంక పెద్దది కావడంతో పాటు బాయ్‌కాట్ అలేఖ్య చిట్టి పికెల్స్ బాగా ట్రెండ్ అయ్యింది. ఈ వివాదానికి కారణమైన అలేఖ్య సైతం ఓ వీడియో రిలీజ్ చేసి తాను తప్పు చేశానని, ఇప్పటి వరకు తాను తిట్టిన వాళ్లందరికీ క్షమాపణలు చెప్పింది.

ఈ వివాదంతో అలేఖ్య చిట్టి పికెల్స్ వ్యాపారం దెబ్బతినగా, పరువు పోయింది. వారి ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసి, సోషల్ మీడియా ఖాతాల్లో మెసేజ్ ఆప్షన్ బ్లాక్ చేశారు. వెబ్‌సైట్‌ కూడా పనిచేయడం లేదు. వివాదం సద్దుమణుగుతుంది అనుకుంటున్న దశలో పెద్దమ్మాయి సుమ కంచర్ల ఓ వీడియో పెట్టారు. తన చెల్లెలు అలేఖ్య ఆసుపత్రి పాలైందని, ఇకనైనా ట్రోలింగ్ ఆపేయమని ప్రాధేయపడ్డారు. బ్రీతింగ్ ఇష్యూస్ వల్ల అలేఖ ఆసుపత్రిలో చేరిందని.. క్షమాపణలు చెప్పినా తమను వదలడం లేదని కన్నీటి పర్యంతమైంది సుమ.

తొలుత బ్రీతింగ్ సమస్యలు రావడంతో అలేఖ్యను ఆసుపత్రికి తీసుకెళ్లామని ఆరోగ్యం కొంత మెరుగవ్వగా.. ట్రోలింగ్ చూశాక మళ్లీ బ్రీతింగ్ సమస్యలు వచ్చాయని చెప్పింది. తమ చెల్లికి చావు తప్ప మరో దిక్కు లేదని ప్రతిరోజూ వీడియోలు , కామెంట్స్‌తో తమను వేధిస్తున్నారని సుమ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితం తమ తండ్రి మరణించారని .. ఇప్పుడు మరో చావును తట్టుకోలేమని ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలకాలని సుమ కంచర్ల కోరారు. ఈ వీడియోలో అలేఖ్య బెడ్‌పై ఉండగా.. ఆమెకు చికిత్స అందిస్తున్న దృశ్యాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X