భర్త జ్ఞాపకాలలో తారకరత్న భార్య... తాళిబొట్టుతో అలేఖ్య నందమూరి ఎమోషనల్

నందమూరి వారసుడు తారకరత్న చనిపోయి అప్పుడే మూడే ళ్లు కావొస్తోంది. ఈ విషాదం నుంచి నందమూరి అభిమానులు ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ హీరో.. చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తరలిపోవడం అందరినీ కలిచివేస్తోంది. అటు తారకరత్న భార్య పిల్లల పరిస్ధితి వర్ణనాతీతం. భర్త జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పిల్లలే లోకంగా బతుకుతున్నారు అలేఖ్య. పిల్లలతోనే గడుపుతూ వారికి తండ్రి లేని లోటు లేకుండా చూసుకుంటున్నారు. తారకరత్న జ్ఞాపకాలు, పిల్లల గురించి పోస్టులు పెడుతుంటారు. తాజాగా అలేఖ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

అలేఖ్య రెడ్డికి అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకుని ఉండగా.. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తారకరత్న. అయితే ఈ వివాహం నందమూరి కుటుంబానికి ఇష్టం లేకపోవడంతో వారికి దూరంగా భార్యతో కలిసి ఉండేవారు తారక్. ఎన్నో కష్టాలు పడి భార్యాబిడ్డలతో సంతోషంగా ఉంటున్న దశలో 2023లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పంలో యువగళం పాదయాత్రను ప్రారంభిస్తుండగా ఈ కార్యక్రమానికి హాజరైన గుండెపోటుతో తారకరత్న కుప్పకూలిపోయారు. బెంగళూరులోని ఆసుపత్రిలో దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న కన్నుమూశారు. భర్త మరణంతో తారకరత్న భార్యాపిల్లలు అనాథలుగా మారారు. నాటి నుంచి భర్త జ్ఞాపకాలను పంచుకుంటున్నారు అలేఖ్య.

Alekhya Nandamuri s Emotional Post on Taraka Ratna Goes Viral

ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు అలేఖ్య. విడాకులు తీసుకున్నాక.. మళ్లీ పెళ్లి చేసుకోవాలని నాకు లేదు, కానీ తారకరత్నతో ప్రేమతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నా. తన తండ్రికి ముందు నుంచి తారకరత్నతో పరిచయం ఉంది. మా పెళ్లికి నా తల్లిదండ్రులు తొలుత అంగీకరించలేదని.. కానీ తర్వాత ఒప్పుకున్నారు. అయితే తారకరత్న కుటుంబానికి మాత్రం మా పెళ్లి ఇష్టం లేదు. నేను ఎప్పుడూ తారకరత్న తల్లిదండ్రులను అత్తయ్య, మావయ్యలుగానే గౌరవించా. కానీ వారు మాత్రం తనను ఇప్పటికీ అంగీకరించలేదని.. కనీసం పిల్లలను అయినా దగ్గరకి తీసుకుంటారని ఎదురుచూస్తున్నట్లు అలేఖ్య తెలిపింది.

నా భర్త నాతోనే ఉన్నాడని నేను నమ్ముతున్నా.. కానీ కొందరు ఇంటికి ఫంక్షన్లకు పిలిచి కావాలని అవమానిస్తున్నారు. నువ్వు కుంకుమ పెట్టుకోకు, హారతి ఇవ్వకు అని మాట్లాడితే గుండె పగిలిపోతుంది. మా ఇంట్లో వాళ్లు ఎవరూ అలాంటి తేడాలు చూపించరు. అందుకే ఎవరి ఇంట్లో పూజలు జరుగుతున్నా వెళ్లను. నాకు పెళ్లికాక ముందు అదే దేవుడు, పెళ్లయిన తర్వాత అదే దేవుడు.. ఇప్పుడు కూడా అదే దేవుడు. మరి నన్నెందుకు ఆపుతున్నారు. వితంతువులు ఇలాగే ఉండాలని రూల్ బుక్ ఏమైనా ఉందా అంటూ అలేఖ్య ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అలేఖ్య నందమూరి.. తన భర్త జ్ఞాపకాలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో తారకరత్నను అలేఖ్య ప్రేమగా ముద్దాడుతున్న ఫోటోకి తాళిబొట్టు తగిలించి ఉంది. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు, దాన్ని ధరించాల్సిన అవసరమే నాకు రాలేదు... ఇప్పుడది నా చేతిలో ఉంది, ఎందుకంటే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అంటూ ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం అలేఖ్య పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X