Just In
- 11 min ago
ఇంతకీ ఈ సంక్రాంతికి వచ్చేది మొగుడా? లేక మగాడా? మహేష్ బాబు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ
- 1 hr ago
మెగా 152: వైరల్ అవుతున్న చిరంజీవి లుక్.. లీక్ అయినట్లేనా?
- 2 hrs ago
ధోనీపై స్టార్ హీరో కామెంట్.. ఆయనో ‘దబాంగ్’ ప్లేయర్’ అంటూ!
- 3 hrs ago
నా ప్రపంచమే అతను.. కొద్దిరోజుల్లోనే మీ ముందుంచబోతున్నా: రాశిఖన్నా
Don't Miss!
- News
పౌరసత్వ చట్టం వల్ల ఉపయోగం ఉందా?: సుప్రీంలో కమల్ హాసన్ పిటీషన్..!
- Sports
ఆయనో 'దబాంగ్' ప్లేయర్'.. ధోనీ నా అభిమాన క్రికెటర్: సల్మాన్ ఖాన్
- Finance
అదే నిజమైతే ఉద్యోగుల్ని ఎప్పుడో తొలగించేవాళ్లం: టాటా మోటార్స్
- Automobiles
కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనున్న మెర్సిడెస్ బెంజ్
- Lifestyle
వైరల్ : కదిలే గుర్రాన్ని గెలికితే.. ఏమవుతుందో ఈ వీడియోలో మీరే చూడండి...
- Technology
టాటా స్కై బింగే + సెట్-టాప్-బాక్స్ ఎలా ఉందొ చూడండి
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
కమెడియన్ ఆలీ నోటి దురుసు.. కోన్ కిస్కా గొట్టం గాళ్లు.. వాళ్లకు తోపులమనే ఫీలింగ్ అంటూ
హీరో, కమెడియన్ ఆలీ అప్పుడప్పుడు తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ.. కొన్నిసార్లు నవ్విస్తాడు. మరికొన్ని తన మాటలను వివాదాలుగా మారుస్తాడు. తాజాగా మరోసారి తన నోటికి పనిచెప్పాడు. రాజు గారి గది 3 సినిమా సక్సెస్ మీట్లో అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమాలపై విమర్శలు చేసే వారిపై అలీ ఏమన్నారంటే..

నాలుగు స్తంభాలు వారే
రాజు గారి గది2 సినిమా విజయం వెనుక నాలుగు బలమైన స్తంభాల (ఫిల్లర్స్)లో ఒకరు సినిమాటొగ్రఫర్ చోటా కే నాయుడు, రెండోది మ్యూజిక్ డైరెక్టర్, మూడోది ఓంకార్, నాలుగ పిల్లర్ నిర్మాత. ఈ సినిమాను థియేటర్ కెళ్లి కూకట్పల్లి భ్రమరాంబ థియేటర్లో ఫ్యామిలీతో కలిసి చూశాను. అక్కడే ఎందుకు చూశానంటే.. ప్రేక్షకులు డబ్బుల పెట్టి సినిమాకు ఎలాంటి కల్మషం లేకుండా వస్తారు. సినిమా బాగుంటే వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు అని ఆలీ అన్నారు.

ప్రివ్యూ చూస్తూ నవ్వరు
ఇక ప్రివ్యూ చూస్తుంటే.. కొందరు మన సొమ్ము పక్కవాడు లాక్కెలుతాడనే ఫీలింగ్‌తో ఉంటారు. ఎదైనా బలవంతంగా నవ్వాల్సి వస్తే బుగ్గల్ని నవ్వినట్టు చేస్తారు. అందుకే నేను ప్రివ్యూలు చూడటానికి ఇష్టపడను. ప్రివ్యూలు చూడటం మానేస్తాను. పెద్ద, చిన్న హీరో అనే తేడా కళామతల్లికి ఉండదు. తల్లికి బిడ్డలందరికి సమానమే అని కామెంట్ చేశారు.

మీరెవరూ.. కోన్ కిస్కా గొట్టం గాళ్లు
ఇక సినిమాల గురించి కొందరు పనిగట్టుకొని బాగాలేదని, ఏదో అనుకొన్నాం. ఏదో ఎక్స్పెక్ట్ చేశాం అని కామెంట్ చేస్తారు. అసలు వాళ్లేవరు సినిమా గురించి చెప్పేవాళ్లు. మీరెవరు.. కోన్ కిస్కా గొట్టం గాళ్లు మీరెవరూ. ఎక్కడి తీసుకెళ్లాలనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఏదో ఒక రాయి వస్తే తోపులమైపోతామనే ఫీలింగ్‌తో కొందరు ఉంటారు అని అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మిమ్మల్ని నమ్ముకొని రాలేదు
కొందరిని నమ్ముకోని ఇండస్ట్రీకి రాలేదు. మీ అంత మూర్ఖులు ఎవరూ ఉండరు. అలాంటి వాళ్లకు రాజు గారి గది 3 సినిమా జవాబు ఇచ్చింది. ఈ సినిమాను సక్సెస్ బాట పట్టించిన దర్శకుడు ఓంకార్, హీరో అశ్విన్ థ్యాంక్. ఈ చిత్రం కోసం టెక్నికల్ విభాగం చాలా కష్టపడింది. అందుకే ఈ సక్సెస్ లభించింది. ఈ సినిమాను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ అని అలీ పేర్కొన్నారు.