బిగ్ బాస్ హౌస్‌లో పదకొండో పార్టిసిపెంట్ అతనే..

గత రెండు సీజన్లు సాఫీగా సాగిన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ విషయంలో మాత్రం వివాదాల్లో ఇరుక్కుంది. షో ప్రారంభానికి ముందే ఈ షో బ్యాన్ చేయాలంటూ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా లాంటి వారి ఆరోపణలు, ఓయూ జెఏసి నిరసనలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది.

100 రోజుల పాటు నిర్విరామంగా జరగనున్న ఈ షోకి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ముందుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఆయన పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరినీ బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానిస్తున్నారు. మొత్తం 15 మంది కంటిస్టెంట్లు పాల్గొననున్న ఈ రియాలిటీ షోలో పదకొండో కంటిస్టెంట్ గా అలీ రెజా అడుగు పెట్టారు. బిగ్ బాస్ హౌస్ లోకి సాదరంగా ఆహ్వానించిన నాగార్జున.. అలీ రెజా గురించి ప్రేక్షకులకు ఇంట్రో ఇచ్చాడు.

Ali Reza Enters Into the Bigg Boss House

అలీ రెజా.. నటుడిగా పలు టీవీ సీరియల్స్, సినిమాలతో బాగా ఫేమస్ అయ్యాడు. గాయకుడు సినిమా ద్వారా వెండితెరపై కాలుమోపిన ఈయన ప్రస్తుతం సినీ మహల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఎంతో ఉత్సాహంగా మిస్టర్ మజ్ను పాటకు డాన్స్ చేస్తూ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున అతన్ని స్వాగతించి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X