ధైర్యమనేది ఎప్పుడూ చావదు.. అలీ రెజా పోస్ట్ వైరల్
అలీ రెజా ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి ముంబైలో ఉన్నాడన్న సంగతి తెలిసిందే. ఊకో కాక మెన్స్ వేరే స్టోర్, బిజినెస్ పని మీద రాహుల్ అలీ రెజాలు కలిసి వెళ్లారు. అయితే అలీ రెజా తాజాగా ఓ పోస్ట్ చేశాడు. ఇందులో వైల్డ్ డాగ్ షూటింగ్‌కు సంబంధించిన స్టిల్‌ను షేర్ చేశాడు. అందులో అలీ రెజాకు ఒంటి నిండా గాయాలు తగిలినట్టుగా, రక్తాలు కారుతున్నట్టుగా మేకప్ వేశార. అంటే అలీరెజా మంచి యాక్షన్ సీక్వెన్స్‌లో ఉన్నాడన్న మాట.
అయితే అలీ రెజా తాజాగా ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ ఓ కామెంట్ చేశాడు. దీన్ని చూసి బిగ్ బాస్ ఫేమ్ యాంకర్ శిల్పా చక్రవర్తి దెబ్బకు భయపడిపోయిందట. వారంతా దుమ్ములో పడుకున్నా కూడా.. ధైర్యం అనేది ఎప్పుడూ చనిపోదు.. వారి సాహసం ఎప్పుడూ కూడా వెయ్యి మంది మనుషులతో సమానం అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్‌లను చూసి శిల్పా చక్రవర్తి షాక్ అయిందట. మొత్తానికి వీరి ముచ్చట్లు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఒక్క సెకన్ భయం వేసిందంటూ శిల్పా కామెంట్ పెట్టింది. అలా శిల్పా ఇచ్చిన కామెంట్లకు అలీ రెజా కూడా ఫన్నీగా స్పందించాడు. మొత్తానికి అలీ రెజా మాత్రం ఇలా రక్తాలు, గాయాలతో ఉన్న ఫోటోను షేర్ చేయడం, ఆ స్టిల్ అవన్నీ చూస్తుంటే వైల్డ్ డాగ్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ మూవీని అశిశూర్ సోలోమన్ తెరకెక్కిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











