RRR Press Meet: తెలుగులో మాట్లాడి షాక్ ఇచ్చిన అలియా భట్.. పగిలిపోయింది.. పిచ్చెక్కిపోయింది అంటూ..

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ RRR కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్ లో చిత్ర యూనిట్ సభ్యులు బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే తమిళ్ మలయాళం కన్నడ ఇండస్ట్రీ లో ప్రెస్ మీట్ కు హాజరైన చిత్ర యూనిట్ సభ్యులు తెలుగు మీడియా ముందుకు కూడా వచ్చారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో ఆలియా భట్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అంతేకాకుండా ఆమె ఎంట్రీలోనే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా మాట్లాడారు.

అందరిని ఆకట్టుకునేలా..

అందరిని ఆకట్టుకునేలా..

అలియా భట్ మొదటిసారి RRR సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టబోతోంది. ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని అనుకుంటున్న అలియా భట్ కు ఇప్పటికే భారీ స్థాయిలో క్రేజ్ అయితే దక్కింది. ఆమె అల్లూరి సీతారామరాజు పాత్రకు సతీమణి సీత పాత్రలో నటిస్తోంది. తప్పకుండా ఆ పాత్ర ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎంతో ఆకట్టుకుంతుందని ఇదివరకే సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ కూడా వివరణ ఇచ్చారు.

బాగునున్నారా అంటూ..

బాగునున్నారా అంటూ..

ఇక సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లో ఆలియాభట్ మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా మొదట తెలుగు మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా తనదైన స్టైల్లో మాట్లాడారు. అందరికీ నమస్కారం అంటూ బాగున్నారా అని ఆప్యాయంగా పలకరించింది. ఇక మీడియా కూడా మీరు బాగున్నారా అని అడగడంతో అందుకు నవ్వుతూ సమాధానం ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆడిటోరియం విజిల్స్ తో మారుమ్రోగింది.

మాకు పిచ్చెక్కిపోయింది అంటూ

మాకు పిచ్చెక్కిపోయింది అంటూ

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మొదటిసారి అలియా భట్ మంచి పాత్రలో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక ఆమె ప్రతీ ప్రెస్ మీట్ లో కూడా పాల్గొంటూ సినిమా ప్రమోషన్ లో కూడా చాలా కీలకం గా వ్యవహరిస్తోంది. తెలుగు ప్రెస్ మీట్ లో అయితే ఆమె తన స్పీచ్ మొదలుపెట్టేముందు ట్రైలర్ పగిలిపోయింది కదా అంటూ ముంబైలో అయితే మాకు పిచ్చెక్కిపోయింది అంటూ తనదైన స్టైల్లో మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంది.

ప్రత్యేకంగా తెలుగు నేర్చుకొని..

ప్రత్యేకంగా తెలుగు నేర్చుకొని..

ఇక త్రిబుల్ ఆర్ సినిమా లో ఆలియా భట్ సొంతంగా తెలుగు నేర్చుకుని డబ్బింగ్ కూడా చెప్పడం విశేషం. ప్రత్యేకంగా ఆమె తెలుగు ట్యూటర్ ను కూడా పెట్టుకుని వీలైనంతవరకూ సినిమా కోసం భాషపై పట్టు సాధించింది. RRR సినిమా చాలా ప్రత్యేకంగా తీసుకొని చాలా హార్డ్ వర్క్ చేసింది. ఇక ప్రస్తుతం ఆమె పలు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆ షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని మరి ప్రమోషన్లో కూడా పాల్గొంటోంది.

రేపటి మీద నమ్మకంతోనే..

రేపటి మీద నమ్మకంతోనే..

ఇక లాక్ డౌన్ లో అయితే తను కూడా చాలా ఇబ్బందికి గురయ్యానని అంటూ.. రేపటి మీద నమ్మకంతోనే అందరూ ముందుకు సాగుతున్నారు అని తను కూడా అలానే ధైర్యంగా ముందుకు సాగినట్లు చెప్పారు. ఇక దర్శకుడు రాజమౌళి తో వర్క్ చేయడం అలాగే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో కూడా కలిసి పని చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుబునందుకు చాలా హ్యాపీగా ఉంది అని వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X