Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బాయ్ ఫ్రెండ్ ఇంటి పక్కనే ఖరీదైన ఇల్లు కొనేసిన RRR బ్యూటీ.. రేటెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
బాలీవుడ్ అగ్ర నటిమణుల్లో ఒకరైన అలియా భట్ రానున్న రోజుల్లో తన స్థాయిని మరింత పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె చేతుల్లో ఉన్న సినిమాలను చూస్తేనే అర్ధమవుతోంది క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ. ఇక రాజమౌళి RRR సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా నటించనున్న ఈ చిన్నది ఇటీవల ఒక స్పెషల్ న్యూస్ తో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కూడా ఆ న్యూస్ వైరల్ అవుతోంది.
ఇల్లు కొనడానికి అసలు కారణం..
అలియా భట్ ఇటీవల కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఆమె తన యూ ట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. తన జీవితంలో హ్యాపీ ముమేంట్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకునే అలియా కొత్త ఇల్లు కొన్నాక ఛాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందని టాక్ వస్తోంది.
ప్రియుడికి దూరంగా ఉండలేక..
ఆమె ప్రియుడు రణ్‌బీర్‌పై ఇష్టంతోనే ఆ ఖరీదైన ఇంటిని అలియా సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ లో అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. చాలా కాలంగా అలియా, రణ్‌బీర్‌తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి ప్రస్తుతం బ్రహ్మాస్త్రా అనే సినిమా కూడా చేస్తున్నారు. ఇక ప్రియుడికి దూరంగా ఉండలేక అమ్మడు అతనికి ఇంకా దగ్గరగా నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాస్ట్లీ ఇల్లును కొనుగోలు చేసిన అలియా
ఇక ఇంతకు ముందు జూహూలోని ఫ్లాట్‌లో ఉండడం వలన రణ్ బీర్ కపూర్ ఇంటికి చాలా దూరంగా ఉండేదట. ఇక ఇప్పుడు ఇద్దరు ఒకే ప్రాంతంలో ఉండేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కొత్త ఫ్లాట్ ఎలా ఉంటుంది? దాని ధర ఎంత ఉండొచ్చు? అనే ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి. ధర 30కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు. చాలా కాస్ట్లీగా అలియా ఆ ఫ్లాట్‌ను తన అభిరుచికి అనుగుణంగా డిజైన్ చేయించుకుందట.
త్వరలో పెళ్లి..
అలియా భట్, రణ్ బీర్ కపూర్ ఇద్దరు కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు గత ఏడాది నుంచి అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. రూమర్స్ పై క్లారిటీ ఎంత ఇచ్చినా కూడా లాభం లేకపోయింది. కానీ ఇప్పట్లో అయితే అలియా పెళ్లిచేసుకోవడానికి ఏ మాత్రం ఇష్ట పడటం లేదట. ఇక ఈ బ్యూటీ RRRతో పాటు బ్రహ్మాస్త్రా సినిమాలతో బిజీగా మారనుంది. అవకాశం వస్తే మరిన్ని పాన్ ఇండియా సినిమాలను చేయాలని ప్లాన్ చేసుకుంటోంది.