ముంబైలో ఇల్లు కొనేసిన రామ్ చరణ్ భామ.. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న ఆలియా భట్ ముంబై నగరంలో ఓ ఇల్లు కొనుగోలు చేసింది. తాజాగా ఆ విషయాన్ని తెలుపుతూ తన యు ట్యూబ్ ఛానెల్ లో వీడియో పోస్ట్ చేసింది ఆలియా. సకల సదుపాయాలతో అబ్బురపరిచేలా ఉండి చూపరులను అట్రాక్ట్ చేస్తోంది ఆ భవనం. వీడియో ద్వారా ఆ ఇంటి విశేషాలను కూడా స్వయంగా అభిమానులతో పంచుకుంది ఆలియా.

కాగా కెరీర్ ఆరంభంలోనే ఒక్కొక్కటిగా ఆలియా వేస్తున్న ఈ అడుగులు చూసి బీ టౌన్ జనం షాకవుతున్నారు. మొదటి నుంచే ఆలియాకు సొంతంగా ఆలోచించడం, సొంతంగా అడుగులు వేయడం అలవాటు. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ పుష్కలంగా ఉన్నప్పటికీ తన కెరీర్ ఆరంభంలో కూడా ఆడిషన్స్ వెళ్లి మరీ హీరోయిన్ గా మారింది ఆలియా. మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' తోనే టాలెంట్ ఏంటో నిరూపించి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తాను సంపాదించిన సొంత డబ్బుతో ముంబాయిలోని జుహూలో ఓ ఇంటిని కొనుకోలు చేసింది. ఫస్ట్ టైమ్ తల్లి తండ్రులు నుంచి బయటకు రావడం చాలా కొత్తగా అనిపిస్తోందని ఈ సందర్భంగా ఆలియా చెప్పుకొచ్చింది.

 Alia Bhatt Purchased a new house in Mumbai

బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ కొట్టేసిన ఆలియా భట్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. తొలి సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాను ఎంచుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తుండగా చెర్రీ సరసన ఆలియా నటిస్తోంది. ఎన్టీఆర్ హీరోయిన్ ఇంకా సెలక్ట్ కాలేదు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30 న విడుడల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X