రాజమౌళి కోసం సిద్ధమవుతున్న అలియాభట్.. RRR షూటింగుకు ఎప్పుడంటే
బాహుబలి తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం RRR. ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీ షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. దాదాపు ఆరు నెలల గ్యాప్ తర్వాత రాజమౌళి టీమ్ మళ్లీ RRR షూటింగును ప్రారంభించింది. షూటింగ్ ప్రారంభానికి సంబంధించిన విషయాన్ని చిన్న టీజర్ ద్వారా అభిమానులకు వెల్లడించారు.
RRR అంటే రౌద్రం రణం, రుధిరం అని మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక అక్టోబర్ 20 తేదీన కొమురం భీమ్‌కు సంబంధించిన ఎన్టీఆర్ లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

తాజా రిపోర్టుల ప్రకారం.. నవంబర్ తొలివారంలో షూటింగుకు రావడానికి సిద్ధంగా ఉన్నానని అలియాభట్ యూనిట్‌కు వెళ్లడించినట్టు సమాచారం. గతంలో కేటాయించిన డేట్స్ క్లోజ్ కావడంతో మరోసారి అలియా ఎక్కువ మొత్తంలో డేట్లను అడ్జస్ట్ చేసినట్టు తెలిసింది. అలియాపై ఎక్కువగా సన్నివేశాలను రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో అలియాభట్ సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
RRR సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటి వరకు 60 శాతం పూర్తయిందని యూనిట్వెల్లడించింది. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











