Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: పుట్టినరోజు కానుకగా లుక్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). బాహుబలి వంటి సూపర్ డూపర్ హిట్ సిరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాబోతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీలూ దృష్టి సారించిన ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మరో రెండు రోజుల్లోనే సర్ప్రైజ్ ఇవ్వబోతుంది ఈ మూవీ యూనిట్.
RRR (రౌద్రం రణం రుధిరం)లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోన్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజును ప్రేమించే సీత పాత్రను ఆమె పోషిస్తోంది. ఈ రోల్‌కు సంబంధించిన లుక్‌ను మార్చి 15న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితమే ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ కూడా వదిలింది. ఇక, మార్చి 15న ఆలియా భట్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకునే ఆమె లుక్‌ను రివీల్ చేయబోతున్నారు. ఆ మధ్య కొద్ది రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్న ఆలియా.. త్వరలోనే హైరదాబాద్‌లో అడుగు పెట్టబోతుంది.
ఇక, ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఆలియా భట్ పాత్ర ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్‌కు ఆమెకు మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉందని అంటున్నారు. ఇందుకోసం దాదాపు నలభై రోజుల పాటు షూటింగ్లో పాల్గొనబోతుందట ఆ బాలీవుడ్ బ్యూటీ. మరోవైపు, డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, ఒలీవియా మోరిస్, రే స్టీవేన్సన్, అలీసన్ డూడీ సహా ఎంతో మంది నటిస్తున్నారు.