చివరి నిమిషంలో హ్యాండిచ్చిన RRR యూనిట్: ఎట్టకేలకు సీతను అలా పరిచయం చేశారు
భారతదేశమే మెచ్చిన దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి.. దక్షిణాది మొత్తం మార్కెట్ ఏర్పరచుకున్న ఇద్దరు స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లోనే బడా ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య.. ఎంతో మంది హాలీవుడ్ బాలీవుడ్ నటులు.. ఈ అన్నింటి కలయికలో వస్తున్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి.
విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈరోజు ఆమె పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని RRRలోని సీత పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. రామరాజు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తోన్న అమ్మాయిగా అందులో దర్శనమిచ్చిందీ బాలీవుడ్ బ్యూటీ. అంతేకాదు, అచ్చ తెలుగు అమ్మాయిలా కట్టూ బొట్టుతో కలిపిస్తోంది. ఈ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ మొత్తం ఆమెకు బర్త్‌డే విసెష్ తెలియజేసింది.
Shashi Movie Pre Release Photos

వాస్తవానికి ఆలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ శనివారమే ప్రకటించింది. కానీ, అందుకు భిన్నంగా ఇది చాలా ఆలస్యంగా వదిలారు. దీంతో RRR యూనిట్‌ను విమర్శిస్తూ నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపించారు. లేట్ అయితే అయిందిలే కానీ, అదిరిపోయే పిక్‌ను వదలడంపై అభిమానులంతా కూల్ అయిపోయారు. ఇదిలా ఉండగా.. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, ఒలీవియా మోరిస్, రే స్టీవేన్‌సన్, అలీసన్ డూడీ సహా ఎంతో మంది నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











