ఆలియాభట్‌కు కరోనా నెగిటివ్.. RRR టీమ్‌కు ఊరట!
బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్‌కు ఊరట లభించింది. తన ప్రియుడు రణ్‌బీర్ సింగ్ కరోనా బారిన పడటంతో ఆమె స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. అయితే తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆలియాభట్‌కు కరోనా నెగిటివ్ అనే విషయం బయటపడింది. దాంతో గంగూభాయ్ కతియావాడి, RRR యూనిట్లు ఊపిరి పీల్చుకొన్నాయి.
ఆలియా ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌కు కోవిడ్ 19 పాజిటివ్ అనే విషయాన్ని ఆయన తల్లి నీతూ సింగ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దాంతో ఆలియాభట్ ఆరోగ్య పరిస్థితి ఏమిటనే ప్రశ్న మొదలైంది. ఎందుకంటే ఇటీవల రణ్‌బీర్, ఆలియా ఇద్దరు బ్రహ్మస్త్ర షూటింగుతోపాటు పలు పార్టీల్లో పాల్గొన్నట్టు తెలిసింది.

అది కాకుండా, ఆలియాభట్ మార్చి 12వ తేదీ నుంచి RRR సినిమా షూటింగులో పాల్గొనాల్సి ఉంది. ఒకవేళ ఆలియాకు కరోనా పాజిటివ్ అంటే సినిమా షూటింగు వాయిదా వేయాల్సి వస్తుందా అనే భయం వెంటాడింది. తాజాగా ఆలియాభట్‌కు నెగిటివ్ అని తేలడంతో RRR షూటింగ్ యధావిధిగా జరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ఆలియాభట్ హీరోయిన్‌గా నటిస్తున్న గంగూభాయ్ కతియావాడి చిత్రం షూటింగులో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కూడా కరోనాబారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన వైద్య చికిత్స తీసుకొంటూ కోలుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











