Most Desirable Man In India: రెండోస్థానంతో బాలీవుడ్ హీరోలకు విజయ్ దేవరకొండ షాక్.. తొలిస్థానం ఎవరిందంటే!

దేశవ్యాప్తంగా 50 మంది మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020 జాబితాలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు అరుదైన గౌరవం దక్కింది. ఈ జాబితాలో ఆయన రెండోస్థానంలో నిలిచారు. బాలీవుడ్‌లో టాప్ హీరోలందరి వెనుకకు నెట్టి ఈ ఘనతను విజయ్ దేవరకొండ సొంతం చేసుకొన్నారు. ఈ జాబితాలో బాలీవుడ్ నటుడు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొదటిస్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఇంకా ఎవరు ఉన్నారంటే..

ఇప్పటికే హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా విజయ్ దేవరకొండ నిలిచారు. రెండేళ్లుగా వరుసగా ఈ టైటిల్‌ను విజయ్ దేవరకొండ నిలబెట్టుకొన్నారు. ఇక దేశవ్యాప్తంగా నిర్వహించిన పోల్‌లో విజయ్ దేవరకొండకు రెండోస్థానం దక్కడం విశేషంగా మారింది.

 All India Most Desirable Men List: Sushant Singh Rajput wins title, Vijay Deverakonda in second place

2019లో విజయ్ దేవరకొండ మూడోస్థానంలో ఉండగా.. 2020లో రెండోస్థానాన్ని ఆక్రమించారు.
ఇక మూడో స్థానంలో ఆదిత్య రాయ్ కపూర్, నాలుగో స్థానంలో వికీ కౌశల్, 5వ స్థానంలో దుల్కర్ సల్మాన్, 6వ స్థానంలో విరాట్ కోహ్లీ, 7 స్థానంలో టైగర్ ష్రాఫ్, 8 స్థానంలో రణ్‌వీర్ సింగ్, 9 స్థానంలో గుర్‌ఫతే సింగ్ ఫిర్జాదా, 10 స్థానంలో సిద్దార్థ్ మల్హోత్రా నిలిచారు.

ఇక 11వ స్థానంలో టీవీ స్ఠార్, బిగ్‌బాస్ ఫేమ్ సిద్దార్థ్ శుక్తా, 12వ స్థానంలో కార్తీక్ ఆర్యన్, 13వ స్థానంలో కార్తీక్ ఆర్యన్, 14వ స్థానంలో దిల్జిత్ దోసంజ్, 15వ స్థానంలో సిద్దాంత్ చతుర్వేది, 16వ స్థానంలో వరుణ్ ధావన్, 17వ స్థానంలో రణ్‌బీర్ కపూర్, 18వ స్థానంలో ఇశ్వాంక్ సింగ్, 28వ స్థానంలో రానా దగ్గుబాటి తదితరులు నించారు.

ఇక విజయ్ దేవరకొండ కెరీర్ విషయానికి వస్తే.. అర్జున్ రెడ్డితో స్టార్ హోదాను దక్కించుకొన్న ఆయన ప్రస్తుతం లైగర్ చిత్రంతో ప్యాన్ ఇండియా హీరోగా మారారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి కరణ్ జోహర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X