అన్ని ఇండస్ట్రీల స్టార్ హీరోలు ఒకే చోట.. అందుకే కలిశారట

కన్నడ ఇండస్ట్రీ నుంచి లెజెండ్ నటుడు రాజ్ కుమార్ కుమారుడు శివ రాజ్‌‌కుమార్, తమిళ ఇండస్ట్రీ గర్వించదగ్గ నటుడైన శివాజీ గణేషన్ తనయుడు ప్రభు, తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఏఎన్నార్ కుమారుడ కింగ్ నాగార్జున.. వీరంతా ఒకెత్తు అయితే బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ ఇలా అందరూ ఒకే చోటుకు ఒకే ఫ్రేములోకి వచ్చారు. అసలు దీని వెనుకున్న కథెంటో ఓ సారి చూద్దాం.

కళ్యాణ్ జువెల్లరి యాడ్స్..

కళ్యాణ్ జువెల్లరి యాడ్స్..

మన తెలుగు ప్రేక్షకులకు కళ్యాణ్ జువెల్లరి అంటే కచ్చితంగా నాగార్జున గుర్తుకువస్తాడు. ఎందుకంటే అంతలా ఆ యాడ్స్ ఫేమస్ అయ్యాయి. గత కొన్నేళ్ల నుంచి కళ్యాణ్ జువెల్లర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నాగ్.. అమితాబ్‌తోనూ కలిసి ఈ ప్రకటనలో నటించాడు. హిందీలో అమితాబ్, కన్నడలో శివ రాజ్‌కుమార్, తమిళ్‌లో ప్రభు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

భారీ యాడ్..

భారీ యాడ్..

తాజాగా వీరందరినీ ఒకే చోటుకు తీసుకువచ్చి.. ఓ పెద్ద యాడ్‌ను షూట్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. కత్రినా పెళ్లి కూతిరిగా కనిపించగా ఆమెకు తల్లిదండ్రులుగా బిగ్‌బీ, ఆయన సతిమణి జయ బచ్చన్‌లు కనిపించనున్నారు. ఈ పెళ్లిలో నాగార్జున, ప్రభు గణేషన్‌, శివ రాజ్‌కూమార్‌లు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

అమితాబ్ ట్వీట్..

అమితాబ్ ట్వీట్..

ఈ యాడ్ షూటింగ్ సమయంలో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘జయకు నాకు ఇది ఎంతో గౌరవకారణమైనది. దీన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేం. సీనీ పరిశ్రమలోని ముగ్గురూ లెజెండరి సూపరస్టార్‌ కుమారులతో కలిసి నటించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. తెలుగు అగ్రకథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున, తమిళ సూపర్‌ స్టార్‌ శివాజీ గణేషన్ తనయుడు ప్రభు గణేషన్‌‌, కన్నడ స్టార్‌ రాజ్‌కుమార్‌ తనయుడు శివరాజ్‌ కుమార్‌లతో కలిసి నటించామ'ని ట్వీట్ చేశాడు.

Recommended Video

#CineBox : Happy Birth Day Trivikram Srinivas

నాగ్ రిప్లై..

అలాంటి వారందరితో కలిసి నటించడం ఎంతో గర్వంగా ఉందని అమితాబ్ చేసిన ట్వీట్‌కు కింగ్ నాగార్జున బదులిస్తూ.. ‘మీకు కాదు సర్.. అది మాకు గర్వకారణం.. మీతో, జయ గారితో కలిసి నటించాము మాకు గర్వకారణంగా ఉంద'ని ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X