టాలీవుడ్‌లో వారసుల లాంచింగ్‌కు విఘ్నాలు.. అన్నీ ఉన్నా, అది మిస్

డాక్టర్ కొడుకు డాక్టర్ అయినట్లు హీరో కొడుకు హీరో అవ్వాలన్నదే ప్రాథమిక సూత్రం. ఒకరిద్దరు తప్పించి చాలా మంది తమ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడిచినవారే. టాలీవుడ్ విషయానికి వస్తే నందమూరి, కొణిదెల, అల్లు, దగ్గుబాటి, ఘట్టమనేని, అక్కినేని కుటుంబాల నుంచి ఎంతో మంది హీరోలుగా వచ్చారు. వీరంతా తమ తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టారు. రాబోయే కొన్నేళ్లలో టాలీవుడ్‌లోకి కొత్త తరం రాబోతోంది. పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్, మహేశ్ కొడుకు గౌతమ్, అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హా తదితరులు వెండితెర మీద లాంచ్ కానున్నారు. యాక్టింగ్, డ్యాన్స్ పరంగా హీరోకి కావాల్సిన అన్ని విభాగాల్లోనూ వీరిని మేకోవర్ చేసే పనిలో ఉన్నారు మన స్టార్ హీరోలు .

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం టాలీవుడ్‌తో పాటు అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ కుర్రాడు నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని, ఫలానా డైరెక్టర్‌తో కాంబినేషన్ సెట్ అయ్యిందని ఏళ్లుగా మీడియాలో ప్రచారం జరిగింది. ఇలా ఊరించి ఊసూరుమనిపిస్తూ ఉండటంతో నందమూరి ఫ్యాన్స్ డీలా పడిపోతున్నారు. మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే పనులను బాలయ్య ఎప్పుడో మొదలుపెట్టారు. కథల ఎంపిక, దర్శకులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేతుల్లో మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతను పెట్టినట్లుగా టాక్. నేడో, రేపో ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

all set for star kids entry in Tollywood but here s the details

అయితే తమ వారసులను ఎంట్రీపై స్టార్స్ ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయని ఇటీవల పరిణామాలు చెబుతున్నాయి. తమ పిల్లలకు ఒక వయసొచ్చి వారికి ట్రైనింగ్ ఇప్పించి లాంచ్ చేసే బదులు వయసుతో సంబంధం లేకుండా అరంగేట్రం చేయించాలని భావిస్తున్నారట. తగిన కథ, మంచి ప్రాజెక్ట్ అయితే చాలు ఆ మూవీలో ఎలాంటి పాత్రియినా సరే తమ పిల్లలలో వేయించడానికి స్టార్స్ రెడీ అవుతున్నట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ బాలనటుడిగా నటించి అలరించారు. అయితే పూర్తి స్థాయి హీరో కావడానికి మనోడి వయసు సరిపోదు కాబట్టి అందుకు కొంచెం సమయం పడుతుంది. మహేశ్ కుమార్తె సితార ఆల్రెడీ సోషల్ మీడియాలో స్టార్‌గా వెలుగొందుతున్నారు. పలు బ్రాండ్స్‌కు ఎండార్స్‌మెంట్ కూడా చేసి తండ్రికి ఏమాత్రం తీసిపోనని నిరూపించుకున్నారు. మంచి కథ ఉంటే ఆమెను కూడా ఇంట్రడ్యూస్ చేయాలని మహేశ్ భావిస్తున్నారట.

all set for star kids entry in Tollywood but here s the details

అల్లు అర్జున్ విషయానికి వస్తే ఆయన కుమార్తె ఆద్య .. శాకుంతలం సినిమాలో భరతుడిగా నటించింది. కుమారుడు ఆయాన్ ఆర్టిస్ట్ కాకుండానే సోషల్ మీడియాలో సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నాడు. హీరో సుధీర్ బాబు కుమారులిద్దరూ అచ్చుగుద్ధినట్లు మేనమామ మహేశ్ లాగా కనిపిస్తుండటంతో వాళ్లు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారోనని ఘట్టమనేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వీరే కాదు మంచు మనోజ్ పిల్లలు, హీరో నాని కుమారుడు కూడా మంచి కథ దొరికితే లాంచ్ పక్కా అనే కామెంట్స్ ఫిలింనగర్‌లో వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ స్టార్స్ అంతా కథ కోసం వెయిట్ చేస్తున్నారన్న మాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X