ఈసారి ఆదిపురుష్ డైలాగ్ రైటర్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు.. నోటీసులు జారీ..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకి వచ్చి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో రావణుడి పాత్రలో కనిపించారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ముఖ్యంగా హిందుత్వ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
సినిమాలోని పాత్రల చిత్రల పూర్తిగా మార్చేశారని, ఆది పురుష్ మూవీ బ్యాన్ చేయాలంటూ డిమాండ్ తెరపైకి వచ్చింది. విపరీతమైన నెగెటివిటీ కారణంగా మొదటి మూడు రోజుల తర్వాత కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయిపోయాయి. ఇప్పటివరకు 450 కోట్ల గ్రాస్ ఈ చిత్రం సాధించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై అలహాబాద్ కోర్టులో బ్యాన్ చేయాలంటూ కొంతమంది పిటిషన్ వేశారు.

సినిమాలోని అభ్యంతర సన్నివేశాలు, సంభాషణలు చాలా ఉన్నాయని, వాటిని సెన్సార్ చేసే సమయంలోనే నిరోధించకుండా ఎందుకు పర్మిషన్ ఇచ్చారంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే సంభాషణలు కూడా తీవ్ర అభ్యంతరకరంగా ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక అలహాబాద్ కోర్టు సినిమాకు డైలాగ్స్ రాసిన మనోజ్ ముంతాషీర్‌కు నోటీసు పంపింది. సెన్సార్ బోర్డుపై కూడా విరుచుకుపడింది
ఇలాంటి సినిమా చూసిన తర్వాత కూడా ప్రజలు శాంతియుతంగా ఉండడం గొప్ప విషయం అని, శాంతి భద్రతల సమస్య తలెత్తితే దానికి సమాధానం ఎవరు చెప్తారు అంటూ నిలదీశారు. ఇలాంటి చిత్రంతో సమాజానికి ఏ రకమైన సందేశం ఇద్దామని మీరు అనుకుంటున్నారు అంటూ దర్శకుడు ఓం రౌత్ ను ధర్మాసనం ప్రశ్నించడం విశేషం. మరి అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలపై ఆది పురుష్ టీం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











