భవిష్యత్తు తరాలకు ఏం నేర్పాలనుకుంటున్నారు..ఆదిపురుష్ కాంట్రవర్సీపై హైకోర్టు సీరియస్
ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామాయణం కథ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాను టీ సీరీస్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇక రాముడి పాత్రలో ప్రభాస్ నటించగా సీతమ్మ తల్లి పాత్రలో కృతి సనోన్ నటించారు. ఈ సినిమా విడుదలకు ముందు కొంత మంచి హైప్ క్రియేట్ చేసినప్పటికీ విడుదల తర్వాత మాత్రం ఊహించని స్థాయిలో దారుణంగా కలెక్షన్స్ అందుకుంది.
వీకెండ్ తప్పితే మిగతా రోజుల్లో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ప్రభాస్ కారణంగా ఓపెనింగ్స్ అయితే గట్టిగానే వచ్చాయి. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా కలెక్షన్స్ మరింత తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఆదిపురుష్ సినిమాకు ఎక్కువగా గ్రాఫిక్స్ విషయంలో నెగిటివ్ టాక్ వచ్చింది. అలాగే కొన్ని డైలాగ్స్ మీద కూడా చాలా రకాల వివాదాలు తెరపైకి వచ్చాయి. చరిత్రను తప్పుగా చూపిస్తే ఎలా ఒప్పుకుంటాము అని చాలామంది హిందూ వాదులు కూడా విమర్శలు చేశారు.

ముఖ్యంగా ఆంజనేయస్వామి డైలాగ్స్ పై కూడా కొన్ని అభ్యంతరాలు రావడంతో వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ డైలాగ్స్ ను మరొక విధంగా మార్చారు. అయితే మరి కొన్ని డైలాగ్స్ పై కూడా వివిధ రకాల వివాదాలు అయితే వచ్చాయి. ఇక అలహాబాద్ కోర్టులో ఈ విషయంపై కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక హైకోర్టు ఈ విషయంపై సెన్సార్ బోర్డు పై ముందుగా సీరియస్ అయింది. కొన్ని డైలాగ్స్ ను వెంటనే తొలగించాలని దాఖలైన పిటిషన్ పై విచారణ జరపగా సెన్సార్ బోర్డును హైకోర్టు తప్పు పట్టింది.
అసలు మొదట సెన్సార్ కి పంపిన సమయంలోనే ఇలాంటి డైలాగ్స్ ను ఎలా సమర్థించారు అని కోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా ఇలాంటి వాటితో భవిష్యత్తు తరాలకు మీరు ఏమి నేర్పాలని అనుకుంటున్నారు అంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దర్శక నిర్మాతలు ఈ విచారణలో హాజరు కాకపోవడం పై కూడా కోర్టు సీరియస్ అయింది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











