Allari Naresh: అల్లరి నరేశ్‌కు పాన్ ఇండియా ప్రాబ్లం... ఆ ఒక్కటి అడక్కు అంటూ!
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటుల్లో అల్లరి నరేశ్ ఒకరు. మొదటి ప్రయత్నంలోనే అల్లరి చిత్రంతో సక్సెస్ అందుకుని సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారాయన. అయితే కొంతకాలంగా అల్లరిని తగ్గించి సీరియస్ కథలనే ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. అలా హాస్య నటుడిగా ఉన్న ఆయన విలక్షన నటుడిగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. రీసెంట్గా నా సామిరంగతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఆయన ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే..
దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్నో ఎవర్ గ్రీన్ సినిమాల్లో 'ఆ ఒక్కటీ అడక్కు' చిత్రం కూడా ఒకటి. సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం 1992లో విడుదలై బిగ్ హిట్‌ను అందుకుంది. 30 ఏళ్ళు దాటినా ఇప్పటికీ ఈ చిత్రాన్ని చాలా మంది టీవీల్లో ఇంట్రెస్ట్‌గానే చూస్తారు. ఇప్పుడు ఈ ఎవర్ గ్రీన్ టైటిల్‌తోనే అలరించేందుకు సిద్ధమవుతున్నారు ఈవీవీ తనయుడు, అల్లరి నరేశ్ సిద్ధమవుతున్నారు.

కెరీర్ ప్రారంభం నుంచి నరేశ్ ఎక్కువగా కామెడీ సినిమాలే చేస్తూ వస్తున్నారు. అలా ఆయన ఇప్పటి రాజేంద్ర ప్రసాద్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ హీరో సాధ్యం కాని రేంజ్లో సూపర్ స్టార్ కృష్ణ తర్వాత అంత స్పీడ్‌గా సినిమాలు చేసిన నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఏడాదికి కనీసం నాలుగు చిత్రాల్లోనైనా నటించేవారు. అయితే కొంత కాలం తర్వాత నరేశ్‌కు హిట్లు కరువయ్యాయి.
దీంతో మధ్య మధ్యలో విలక్షణ పాత్రలు చేయడం మొదలుపెట్టారు. అలా 'నాంది' చిత్రంతో పూర్తిగా రూట్ మార్చి సీరియస్ సినిమాలను చేయడం ప్రారంభించారు. అలా నాందితో సూపర్ హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం వంటి చిత్రాలు చేశారు. అవి పర్వాలేదనిపించాయి. ఇక రీసెంట్గా నాగార్జున 'నా సామి రంగ'లో కీలక పాత్ర పోషించి తన నటనటో ప్రశంసలను అందుకున్నారు. ప్రస్తుతం 'బచ్చలమల్లి'లో అనే చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా నరేశ్ మరో సినిమాకు కమిట్ అయ్యారు. దాని పేరే 'ఆ ఒక్కటీ అడక్కు'. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్మెంట్ చేస్తూ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో నరేశ్.. ఎంత ప్రయత్నించినా పెళ్లి సంబంధాలు సెట్ అవ్వని వ్యక్తిలా కనిపిస్తున్నారు. అంటే వెంకటేశ్ మల్లీశ్వరి సినిమాలో పెళ్లి కాని ప్రసాదులా. ఇంకా ఈ గ్లింప్స్‌లో... ఇస్త్రీ చొక్కా వేసుకుని బయటకు వెళ్తున్న నరేశ్ కోసం ఇంటి చుట్టూ పక్కన ఉన్న వాళ్లంతా పెళ్లి ఎప్పుడూ అని అడగడానికి సిద్ధంగా ఉంటారు. అతడు రాగానే అందరు పెళ్లి ఎప్పుడూ పెళ్లి ఎప్పుడూ అంటూ ఒక్కో భాషల్లో అడుగుతుంటారు. దానికి ఫ్రస్టేషన్ అవుతూ అతడు చివరికి ఇది పాన్ ఇండియా ప్రాబ్లం.. ఆ ఒక్కటి అడక్కు అంటూ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. అలా ఫన్నీగా సాగిందీ గ్లింప్స్.



Click it and Unblock the Notifications











