పెద్ద షాకిచ్చిన అల్లరి నరేష్.. ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి అంటూ!

తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా తక్కువ మంది సినీ వారసులు మాత్రమే తమదైన రీతిలో ప్రేక్షకులను అలరించి స్టార్లుగా ఎదిగారు. అలాంటి వారిలో విలక్షణ నటుడు అల్లరి నరేష్ ఒకడు. మొదట్లో ఫన్ మూవీలతో అలరించిన అతడు.. ఈ మధ్య కాలంలో ప్రయోగాలు చేస్తోన్నాడు. కానీ, విజయాలను అందుకోవడంలో మాత్రం సక్సెస్ కావడం లేదు.

భారీ హిట్‌పై కన్నేసిన అల్లరి నరేష్ ఇటీవలే 'ఆ ఒక్కటీ అడక్కు' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ సినిమా అతడికి విజయాన్ని అందించలేదు. దీంతో ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలన్న కసితో ఉన్నాడు. ఇందుకోసం అల్లరి నరేష్ ప్రస్తుతం 'బచ్చల మల్లి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది.

Allari Naresh Birthday Glimpse Released From Bachhala Malli Movie

అల్లరి నరేష్ హీరోగా సుబ్బు తెరకెక్కిస్తోన్న చిత్రమే 'బచ్చల మల్లి'. రూరల్ బ్యాగ్‌డ్రాప్‌తో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇలా ఇప్పటికే సగం కంటే ఎక్కువగానే టాకీ పార్టును సైతం కంప్లీట్ చేసుకున్నారు.

Allari Naresh Birthday Glimpse Released From Bachhala Malli Movie

ఈరోజు హీరో అల్లరి నరేష్ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'బచ్చల మల్లి' సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ వీడియోను వదిలారు. దీంతో అల్లరి నరేష్ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఊరమాస్ అవతారంతో అందరికీ షాకిచ్చాడు. అంతేకాదు, 'ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి' అంటూ క్రేజ్ డైలాగ్ చెప్పాడు.

తాజాగా వచ్చిన 'బచ్చల మల్లి' సినిమా గ్లింప్స్ వీడియో ఎంతో ఇంటెన్స్‌గా ఉంది. ముఖ్యంగా ఇందులో అల్లరి నరేష్ లుక్, సెటప్ అంతా విభిన్నంగా కనిపిస్తున్నాయి. అలాగే, హీరో బాడీ లాంగ్వేజ్‌ 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్‌ను గుర్తు చేసేలా ఉంది. ఇక, ఈ గ్లింప్స్ వీడియోలో బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ బాగున్నాయి. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. రూరల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న 'బచ్చల మల్లి' సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, బాలాజీ గుట్ట నిర్మిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X