అల్లరి నరేష్ పెద్ద మనసు.. ప్రతీ ఒక్కరికీ పదివేలు.. సినిమా యూనిట్‌కు ఆర్థిక సాయం

కరోనా దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ అయింది. 21 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని, రోడ్లపైకి రాకుడదని అలాగైతేనే కరోనాను అరికట్టగలమని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందే తెలుగు సినీ పరిశ్రమ.. స్వచ్చందంగా ఇండస్ట్రీలోని అన్ని కార్యకలాపాలను నిలిపివేసింది.

షూటింగ్స్ అన్నింటిని బంద్ చేసి కరోనాను అరికట్టేందుకు పోరాటం మొదలు పెట్టింది. దీంతో స్టార్ హీరో నుంచి సైడ్ ఆర్టిస్ట్ వరకు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో రెక్కాడితే గానీ డొక్కాడని పేద కళాకారులు, సినీ కార్మికులు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వీరిని ఆదుకునేందుకు చిరంజీవి, వివి వినాయక్ వంటి వారు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే అల్లరి నరేష్ కూడా ముందడుగు వేశాడు.

ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన చేస్తూ.. 'మనిషిగా కష్టం వచ్చినప్పుడు.. అందరం అందరి కోసం నిలబడలేకపోవచ్చు.. కానీ ప్రతీ ఒక్కరూ పక్కవారి కోసం ఎంతో కొంత చెయ్యగలం.. కోవిడ్ 19 నివారణ కోసం జరిగే ఈ 21 రోజుల లాక్ డౌన్ వల్ల.. మా నాంది యూనిట్‌లో రోజూ వారి వేతనంతో జీవనం సాగించే వారి 50 మందికిపైగా ఉన్న మా కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా వుండాలని, మా యూనిట్ తరుపున నేను.. మా నిర్మాత సతీష్ వేగేశ్న కలిసి.. ప్రతీ ఒక్కరికీ తలా పది వేల రూపాయలు సాయం అందించాలని నిర్ణయించుకున్నాం.

Allari Naresh Helps To Nandhi Team In Covid 19 Crisis

ఇది గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నం కదు.. సాటి మనిషికి సాయం చెయ్యడం మన కర్తవ్యం.. ఈ సాయం కావాలి.. మరిన్ని సాయాలకు 'నాంది'' అంటూ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X