అల్లరి నరేష్ ‘నాంది’ మూవీ అరుదైన ఘనత: ఈ మధ్య కాలంలో ఇదే బెస్ట్ రికార్డ్

కెరీర్ ఆరంభం నుంచే వరుసగా హాస్య ప్రధాన్యమైన సినిమాలను చేస్తూ కామెడీ హీరోగా గుర్తింపును అందుకున్నాడు టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్. చాలా తక్కువ సమయంలోనే యాభైకు పైగా సినిమాలు చేసిన అతడు.. జయాపజయాలను ఏమాత్రం బేరీజు వేసుకోకుండా ముందుకెళ్తున్నాడు. అందుకే ప్రతికూల ఫలితాలనే ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ హీరో.. 'నాంది' అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథతో వచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ అరుదైన రికార్డును సాధించింది.

విజయ్ కనకమేడల అనే నూతన దర్శకుడితో అల్లరి నరేష్ చేసిన చిత్రమే 'నాంది'. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'నాంది' అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. మొదటి ఆట నుంచే హిట్ టాక్‌ను సంపాదించుకున్న ఈ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో బుక్ మై షో యాప్‌లో ఈ సినిమా 93% లైకులు సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇటీవలి కాలంలో ఇంత మొత్తంలో ప్రేక్షకుల ఆదరణను అందుకున్న సినిమానే లేదు. దీంతో తాజాగా చిత్ర యూనిట్ ప్రత్యేకించి ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

 Allari Naresh Naandhi got 93% likes in Bookmyshow

అల్లరి నరేష్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను సతీష్ వేగేశ్న నిర్మించారు. కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఇక, ఈ మూవీ మొదటి రోజే దాదాపు రూ. 50 లక్షల వరకూ షేర్‌ను రాబట్టింది. అల్లరి నరేష్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌ను అందుకుంది. వీకెండ్ దినాలు కావడంతో శని, ఆదివారాల్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మరింత స్పందన వచ్చే అవకాశం ఉంది. దీంతో బ్రేక్ ఈవెన్‌ను కూడా దాటేయొచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X