Don't Miss!
- News rasi phalalu today: ఈ రాశులవారు మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్‌పై వేటు!
- Lifestyle మీ బాయ్‌ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్‌లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్‌జున్‌వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు: అప్పటి నుంచే స్ట్రీమింగ్ కానున్న సినిమా
కొన్నేళ్లుగా సరైన హిట్ అందక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు వర్సటైల్ యాక్టర్ అల్లరి నరేష్. అన్ని రకాల సినిమాల్లో నటించగల సామర్థ్యం ఉన్నప్పటికీ.. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఎన్నో ఫ్లాపులను చవి చూశాడీ హీరో. వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటోన్న తరుణంలో.. ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలని భావించిన అతడు విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడితో 'నాంది' సినిమా చేశాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తద్వారా నరేష్‌కు విజయం దక్కింది.
అల్లరి నరేష్ వన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్న 'నాంది' రెండు వారాలగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కెరీర్లోనే క్లిష్ట సమయంలో అతడికి హిట్‌ను అందించిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఇప్పటికీ ప్రేక్షకాదరణతో దూసుకుపోతోన్న ఈ సినిమా డిజిటల్ ప్రీమియం డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్ర స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వీడియో.. దీన్ని మార్చి 12 నుంచి ఆన్లైన్లో ఉంచనున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సదరు సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
నరేష్ కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'నాంది'ని సతీష్ వేగేశ్న నిర్మించారు. కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలతో పాటు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అలాగే, కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు రూ. 2 కోట్లు వరకూ లాభాలు కూడా వచ్చాయి. ఈ ఫలితంతో నరేష్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ ఖుషీగా ఉంది.