Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రముఖ ఓటీటీలో విడుదలైన ‘నాంది’: నరేష్ సినిమాకు అదిరిపోయే ఆరంభం
ఎప్పుడో 2012లో విడుదలైన 'సుడిగాడు' తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా దక్కించుకోలేకపోయాడు టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్. వరుస పెట్టి ఎన్ని సినిమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల వచ్చిన 'నాంది' అనే సినిమాతో సుదీర్ఘ విరామం తర్వాత హిట్ ట్రాక్ ఎక్కాడతను. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. ఫలితంగా నరేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక, ఈ సినిమాను తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ విడుదల చేసింది.
అల్లరి నరేష్ నటించిన 'నాంది' సినిమాను తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' విడుదల చేసింది. మార్చి 12 అర్ధరాత్రి 12 గంటల నుంచే ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. అప్పుడే దీన్ని స్ట్రీమింగ్ చేసేస్తున్నారు చాలా మంది సినీ ప్రియులు. దీంతో ఈ సినిమాకు ఆరంభంలోనే మంచి ఆదరణ లభిస్తున్నట్లు తెలిసింది. ఇక, ఈ చిత్రం ఓటీటీ హక్కులను ఆహా సంస్థ భారీ ధరకే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 'నాంది' సినిమా ఫిబ్రవరి 19న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలా వచ్చిన మూడు వారాలకే ఈ సినిమా ఓటీటీలో ప్రత్యేక్షం అవడం గమనార్హం.
నరేష్ కెరీర్లోనే క్లిష్ట సమయంలో వచ్చిన 'నాంది' చిత్రాన్ని కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించాడు. సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలతో పాటు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అలాగే, కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు రూ. 2 కోట్లకు పైగానే లాభాలు కూడా వచ్చాయి. ఈ ఫలితంతో నరేష్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ ఖుషీగా ఉంది.