twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ ఓటీటీలో విడుదలైన ‘నాంది’: నరేష్ సినిమాకు అదిరిపోయే ఆరంభం

    |

    ఎప్పుడో 2012లో విడుదలైన 'సుడిగాడు' తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా దక్కించుకోలేకపోయాడు టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్. వరుస పెట్టి ఎన్ని సినిమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల వచ్చిన 'నాంది' అనే సినిమాతో సుదీర్ఘ విరామం తర్వాత హిట్ ట్రాక్ ఎక్కాడతను. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. ఫలితంగా నరేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక, ఈ సినిమాను తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ విడుదల చేసింది.

    అల్లరి నరేష్ నటించిన 'నాంది' సినిమాను తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' విడుదల చేసింది. మార్చి 12 అర్ధరాత్రి 12 గంటల నుంచే ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. అప్పుడే దీన్ని స్ట్రీమింగ్ చేసేస్తున్నారు చాలా మంది సినీ ప్రియులు. దీంతో ఈ సినిమాకు ఆరంభంలోనే మంచి ఆదరణ లభిస్తున్నట్లు తెలిసింది. ఇక, ఈ చిత్రం ఓటీటీ హక్కులను ఆహా సంస్థ భారీ ధరకే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 'నాంది' సినిమా ఫిబ్రవరి 19న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలా వచ్చిన మూడు వారాలకే ఈ సినిమా ఓటీటీలో ప్రత్యేక్షం అవడం గమనార్హం.

    Allari Naresh Naandhi Released on AHA

    నరేష్ కెరీర్‌లోనే క్లిష్ట సమయంలో వచ్చిన 'నాంది' చిత్రాన్ని కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించాడు. సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలతో పాటు సూపర్ హిట్ టాక్ వచ్చింది. అలాగే, కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు రూ. 2 కోట్లకు పైగానే లాభాలు కూడా వచ్చాయి. ఈ ఫలితంతో నరేష్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ ఖుషీగా ఉంది.

    English summary
    Edara "Allari" Naresh is an Indian film actor who works predominantly in Telugu-language films. He is an established actor known for his lead roles, mainly in comedy films, with commercial successes such as Allari, Thotti Gang, Kithakithalu, Gamyam, Blade Babji, Bendu Apparao R.M.P, Seema Tapakai, Sudigadu, Yamudiki Mogudu, and Maharshi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X