మరో షాకింగ్ పిక్ : ఒంటి మీద బట్టల్లేకుండా.. అల్లరి నరేష్ డేరింగ్ స్టెప్

ఇప్పుడిప్పుడే తెలుగు చిత్రసీమ కమర్షియాల్టీకి దూరంగా రియాల్టీకి దగ్గరగా ఉండే కథలను ఎంచుకుంటోంది. హీరోయిజానికి ప్రాధాన్యత ఇచ్చినా రా కంటెంట్, సహజత్వం ఉట్టిపడేలా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఈ విషయంలో తమిళ, మళయాల పరిశ్రమలే ముందుంటాయన్నది నిర్వివిదామైన అంశం. అయితే తెలుగులోనూ ఈ తరహా చిత్రాలు రావడం ప్రారంభించాయి. విషాదకరమైన ఎండింగ్‌లను ఇంకా ఆదరించేందుకు కాసింత సమయం పట్టినా ప్రేక్షకులు మాత్రం సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలకే ఓటు వేస్తున్నారు. వాటిని ఆదరిస్తున్నారు.

సహజత్వానికి దగ్గరగా..

సహజత్వానికి దగ్గరగా..

రంగస్థలం, పలాస, మల్లేశం వంటి చిత్రాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. వీటిని దాదాపు ప్రేక్షకులు తమ మనసులకు హత్తుకుంటారు. అయితే తమిళం, మళయాలంలో హిట్ అయిన చిత్రాలను మనం ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తుంటారు. అలా వచ్చిన చిత్రాలు కూడా సక్సెస్ అయ్యాయి.

సాహసోపేతమైన పాత్రలు..

సాహసోపేతమైన పాత్రలు..

అయితే కోలీవుడ్, మాలీవుడ్ హీరోలు నటించినట్టుగా మన హీరోలు కనిపిస్తే ఫ్యాన్స్ జీర్ణించుకోలేరు. అక్కడి హీరోలు అవసరమైతే నగ్నంగానూ నటిస్తారు. కానీ అదే మన హీరోల విషయానికొస్తే ఫ్యాన్స్ ఒప్పుకోరు. సీన్ డిమాండ్ చేసినప్పటికీ ఆ విధంగా చేయలేరు. అందుకే కత్తి రీమేక్ ఖైదీ నంబర్ 150లో పోలీస్ స్టేషన్ సీన్‌లో చిరంజీవి దుస్తులు ధరించే ఉంటాడు. కానీ ఒరిజినల్‌లో అలా ఉండదు.

సాహసం చేస్తున్న చిన్న హీరోలు..

సాహసం చేస్తున్న చిన్న హీరోలు..

మన టాలీవుడ్‌లోనూ అలాంటి సాహసం చేసే హీరోలున్నారు. ఆ మధ్య దొరసాని చిత్రంలో ఆనంద్ దేవరకొండ నగ్నంగా నటించాడు. తాజాగా అల్లరి నరేష్ కూడా అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఒంటి మీద బట్టలు లేకుండా నటించేందుకు ఒప్పుకున్న నరేష్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

నాంది పోస్టర్ వైరల్..

నాంది పోస్టర్ వైరల్..


అల్లరి నరేష్ ప్రస్తుతం విజయ్ కనకమేడల దర్శకత్వంలో నాంది అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. పోలీస్ స్టేషన్‌లో అల్లరి నరేష్ నగ్నంగా కూర్చున్న ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. FIR (ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్) అంటూ టీజర్ జూలై 30న రాబోతోందని ప్రకటించారు. గతంలోనూ ఇలాంటి ఓ పోస్టరే రిలీజ్ చేశారు. ఈ సినిమాను సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X