అల్లరి నరేష్ చేతుల మీదుగా ఇక్షు మూవీ ఫస్ట్‌లుక్.. మంచి విజయం సాధించాలని ఆకాంక్ష

టాలీవుడ్‌లో చిన్న సినిమాలు, వైవిధ్యమైన కథా చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. కథ, కథనాలు బాగుంటే చిన్న నటుల చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద హల్‌చల్ చేస్తున్నాయి. అలాంటి నేపథ్యంతో విభిన్నంగా వస్తున్న చిత్రం ఇక్షు. టైటిల్‌లోనే కొత్తదనం నింపుకొన్న ఈ చిత్రం పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై హనుమంత రావు నాయుడు , డాక్టర్ గౌతం నాయుడు సమర్పణలో రూపొందుతున్నది.

యువ నటుడు రాం అగ్నివేష్ హీరోగా ఋషిక దర్శకత్వంలో డాక్టర్ అశ్విని నాయుడు నిర్మించిన ఈ చిత్రానికి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హీరో అల్లరి నరేష్ చేతుల మీదుగా విడుదల చేశారు.

 Allari Naresh releases Ikshu movie first look

ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. టైటిల్ చూస్తే చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నది.ఈ ససినిమాని ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు. ఈ సినిమా దర్శకురాలు ఋషిక, నిర్మాత డాక్టర్ అశ్విని నాయుడు, చిత్ర కథానాయకుడు రాం అగ్నివేష్‌కు మంచి పేరు రావాలి. అలాగే చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

 Allari Naresh releases Ikshu movie first look

ఇక్షు సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ హీరో అల్లరి నరేష్ చేతుల మీదుగా విడుదల చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇది మొదటి చిత్రం. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి నన్ను మా టీం ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం అని రాం అగ్నివేష్, దర్శకురాలు ఋషిక , నిర్మాత అశ్విని నాయుడు తెలిపారు.

నటీనటులు: రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి, తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఋషిక
మ్యూజిక్: వికాస్ బాడిస
ఎడిటింగ్: ఎస్ బీ ఉద్ధవ్
కెమెరా: నవీన్ తొడిగి
ఆర్ట్స్: రాజు
పాటలు:-కాసర్ల శ్యామ్
మాటలు: మున్నా ప్రవీణ్
కొరియోగ్రఫీ: భాను
మూల కథ: సిద్ధం మనోహర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ గుత్తుల, చిత్రం శ్రీను
పిఆర్వో: మధు వి ఆర్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X