షాకింగ్: ఒంటి మీద నూలుపోగు లేకుండా గాయాలతో అల్లరి నరేష్

టాలీవుడ్‌లో మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా పేరుతెచ్చుకున్నారు అల్లరి నరేష్. ఓ కామెడీ హీరోగా అశేష అభిమాన వర్గాన్ని సంపాదించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాంటి ఈ అల్లరోడు ఇప్పుడు తన కొత్త సినిమాలో న్యూడ్‌గా నటిస్తుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వివరాల్లోకి పోతే..

అల్లరి నరేష్.. ప్రయోగాత్మక సినిమా

అల్లరి నరేష్.. ప్రయోగాత్మక సినిమా

ఒకప్పుడు ఫుల్‌ ఫాంలో కనిపించి వరుస సినిమాలు చేసిన అల్లరి నరేష్.. ఈ మధ్య తన సినిమాల జోరు తగ్గించాడు. వరుస పరాజయాలు పలకరిస్తుండటంతో టైం గ్యాప్ ఇచ్చి కాస్త డిఫరెంట్ సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఓ ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

అల్లరి నరేష్ కెరీర్‌లో 57వ సినిమా

అల్లరి నరేష్ కెరీర్‌లో 57వ సినిమా

జెట్‌ స్పీడుతో 50 సినిమాలు పూర్తి చేసిన ఈ యంగ్ హీరో సతీష్ వేగేశ్న నిర్మాణంలో కొత్త సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. విజయ్ కనకమేడల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అల్లరి నరేష్ కెరీర్‌లో 57వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కనుంది.

'నాంది'.. ప్రారంభోత్సవం

'నాంది'.. ప్రారంభోత్సవం

ఈ సినిమాకు డిఫెరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు. 'నాంది' అనే పేరు కన్ఫర్మ్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ రోజు (జనవరి 20) హైదరాబాద్‌లో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే నరేష్ లుక్ ఒకటి విడుదల చేసిన యూనిట్.. ప్రారంభోత్సవం సందర్భంగా మరో ఇంట్రస్టింగ్ ఫస్ట్‌‌లుక్‌ రిలీజ్ చేశారు.

ఒంటి మీద నూలుపోగు లేకుండా గాయాలతో..

ఒంటి మీద నూలుపోగు లేకుండా గాయాలతో..

ఈ పోస్టర్‌లో ఒంటి మీద నూలుపోగు లేకుండా గాయాలతో తల కిందులుగా వేళాడుతూ కనిపించాడు అల్లరి నరేష్. ఈ లుక్ చూసి ప్రేక్షకులు షాక్‌ అవుతున్నారు. లుక్ ఇంత డిఫరెంట్‌గా ఉందంటే ఇక సినిమా కథాంశం మరింత డిఫెరెంట్ గా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

Recommended Video

Allari Naresh Launches Mr.Killer Movie Teaser & Mr.Killer Movie Teaser

నాంది మూవీ విశేషాలు

ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీన్‌, ప్రియదర్శి, దేవీ ప్రసాద్‌, వినయ్‌ వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకల బాణీలు కడుతున్నారు. త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేసేస్తామని అంటోంది చిత్రయూనిట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X