అల్లు అరవింద్, బోయపాటి కాంబోలో సినిమా.. హీరో విషయంలో దాగుడు మూతలు.. అందుకోసమేనా?
అల్లు అరవింద్, బోయపాటి శ్రీను కాంబోలో కొత్త సినిమా రాబోతుంది. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి వీరిద్దరి కాంబోలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే సైరనోడు సినిమా తర్వాత వీరి కాంబోలో రాబోతున్న సినిమా ఇదే. అయితే అధికారికంగా ఈ విషయం ప్రకటించినప్పటికీ హీరో ఎవరు అన్నదానిపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోగా ఎవరు చేయబోతున్నారనేది చెప్పకుండా పెద్ద ప్లానే వేశారు అల్లు అరవింద్. మరి ఈ సినిమాలో హీరో ఎవరు, ఎందుకు కథానాయకుడి పేరు రివీల్ చేయకుండా దాగుడు మూతలు ఆడుతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లు అరవింద్, బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న సినిమాలో హీరో అల్లు అర్జున్ యే అని చాలా మంది అనుకుంటున్నారు. అనుకోవడం కాదు అదే నిజం అని కూడా తెలుస్తోంది. అయితే ఇది బహిరంగ రహస్యమే అయినప్పటికీ ఇప్పటికీ ఎందుకు పేరు రివీల్ చేయలేదనే దానిపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తుండగా.. ఆ తర్వాతి ప్రాజెక్ట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉంటుందని గతంలో చాలా సార్లు వార్తలు వచ్చాయి.

పుష్ప 2 తర్వాత ఆయన గురూజీతోనే సినిమా చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆ లెక్కలు మారిపోయాయి. ఇటీవలే మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమా కథకు మిక్స్డ్ టాక్ రావడం పెద్దగా అందరూ మెచ్చకపోవడంతో ఆయన ఎప్పుడూ పాత సినిమాలే తీస్తారనే ముద్ర పడింది. గురూజీ కొత్తగా ఆలోచించట్లేదని.. ఎప్పుడూ ఒకప్పుడు రావాల్సిన కథలతోనే వస్తున్నారని చాలా మంది అంటున్నారు. ఇదే విషయాన్ని అర్థం చేసున్న అల్లు అరవింద్, అల్లు అర్జున్ లు తమ నెక్స్ట్ ప్రాజెక్టును గురూజీతో కాకుండా బోయపాటితో చేస్తున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే హీరో పేరు ముందుగా రీవిల్ చేయకుండా ఉంటేనే బెటర్ అని.. పుష్ప2 తర్వాత బన్నీని తీసుకు వచ్చి ఈ సినిమా చేయించాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఆ తర్వాత అయినా అల్లు అర్జున్ గురూజీతో సినిమా చేస్తారా లేదా అనేది తెలియదు. మరి ఇప్పటికే లాక్ అయిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుంది, ఎప్పటి నుంచి రాబోతుందనేది తెలియాలి అంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











