దిల్ రాజు, అరవింద్ మెగా ప్లాన్... కొడితే మినిమమ్ వంద కోట్లు!

Recommended Video

Dil Raju- Allu Aravind To Remake Telugu Hit Movie In Bollywood || Filmibeat Telugu

తెలుగు సినీ పరిశ్రమలో సుధీర్ఘ కాలంగా తన హవా కొనసాగిస్తున్న టాప్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు. ఇద్దరూ వేర్వేరు ప్రాజెక్టులు చేస్తూ ఇండస్ట్రీలో తమ స్టామినా ఏమిటో నిరూపించుకుంటూనే అవసరాన్ని బట్టి కలిసి పని చేస్తున్నారు. గతంలో ఈ స్టార్ నిర్మాతలిద్దరూ సంయుక్తంగా పిల్లా నువ్వులేని జీవితం చిత్రం నిర్మించిన సంగతి తెలిసిందే.

వీరు కేవలం నిర్మాతలుగా మాత్రమే కాకుండా... సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో బలంగా పాతుకుపోయి ఉన్నారు. ఇండస్ట్రీలో పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో ఈ స్టార్ ప్రొడ్యూసర్స్ హెల్ఫ్ లేకుండా గ్రాండ్ రిలీజ్ అసాధ్యం. ఇలా తెలుగు ఇండస్ట్రీలో తమ హవా కొనసాగిస్తున్న వీరు త్వరలో బాలీవుడ్లో అడుగు పెట్టబోతున్నారట.

‘జెర్సీ' సినిమా కోసం...

‘జెర్సీ' సినిమా కోసం...

తాజాగా సమాచారం ప్రకారం... నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ' చిత్రాన్ని అల్లు అరవింద్, దిల్ రాజు కలిసి హిందీలో నిర్మించబోతున్నారట. గీతా ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్టెన్మెంట్స్ ఈ సినిమా నిర్మాణంలో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది.

హీరోగా ఎవరు?

హీరోగా ఎవరు?

తెలుగు వెర్షన్ దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీలోనూ డైరెక్ట్ చేస్తారని టాక్. అయితే హిందీ వెర్షన్లో హీరోగా ఎవరిని తీసుకుంటారు? అనేది హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం షాహిద్ కపూర్, వరుణ్ ధావన్ పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

కరణ్ జోహార్ లేనట్లేనా?

కరణ్ జోహార్ లేనట్లేనా?

గతంలో ఈ ‘జెర్సీ' మూవీ రీమేక్ రైట్స్ కరణ్ జోహార్ దక్కించుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఇపుడు ఇపుడు దిల్ రాజు, అల్లు అరవింద్ పేర్లు తెరపైకి రావడం చర్చనీయాంశం అయింది. మరి ఇందులో కరణ్ జోహార్ ఉన్నారా? లేదా? అనేది అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది.

దిల్ రాజు, అరవింద్ మెగా ప్లాన్... కొడితే మినిమమ్ వందకోట్లు!

దిల్ రాజు, అరవింద్ మెగా ప్లాన్... కొడితే మినిమమ్ వందకోట్లు!

‘అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్' బ్లాక్ బస్టర్ విజయం అందుకుని రూ. 300 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలోనే దిల్ రాజు, అరవింద్ ఈ మెగా ప్లాన్ వేసినట్లు సమాచారం. ‘జెర్సీ' రీమేక్ ద్వారా కొడితే మినిమమ్ రూ. 100 కోట్లు కొట్టాలని టార్గెట్‌గా పెట్టుకున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X