Varun Tej Lavanya పెళ్లిలో చిరు అమ్మ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మిస్సింగ్...ఇది మీరు గమనించారా?
5 ఏళ్లుగా సీక్రెట్ గా ప్రేమించుకుని.. ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి. వారి ప్రేమను పెద్దలకు చెప్పి.. ఇరు కుటుంబాల సమక్షంలో అంగ రంగవైభవంగ్ పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే మెగా హీరోలు అంతా ఓకే ఫ్రేములో ఉన్న ఫోటో అయితే నెట్టింట షేక్ చేస్తుంది. అయితే ఆ పెళ్లి వేడుకలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మిస్ అయినట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి అమ్మగారు కాకుండా.. మరో ఇంపార్టెంట్ పర్సన్ మిస్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే...
మిస్టర్ సినిమాతో మొదలైన పరిచయం.. అంతరిక్షం సినిమాతో ప్రేమగా మారింది. అలా వరుణ్ లావణ్య ప్రేమలో పడిపోయారు. మొదట వరుణ్ తేజ్ ప్రపోజల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ భామ వరుణ్ ప్రేమకు ఫిదా అయిపోయి.. వెంటనే ఓకే చెప్పేసింది. ఆ తర్వాత వీరు సీక్రెట్ గా 5 ఏళ్లు ప్రేమించుకున్నారు. మరోవైపు నిహారికతో స్నేహం... చేస్తూనే.. వరుణ్ తో ప్రేమలో ఉంది. ఈ విషయం బయటకు రాకుండా ఇద్దరూ బాగానే కవర్ చేశారు.

ఇక వీరు పెద్దలకు ప్రేమ విషయం చెప్పి.. అంగ రంగ వైభవంగ్ ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. నిన్ననే వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు . వీళ్ళు తొలిచూపులోనే అట్రాక్ట్ అయిన దేశంలోనే తమ పెళ్లి జరగాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. మిస్టర్ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగినప్పుడు వరుణ్.. లావణ్య ప్రేమలో పడిపోయాడు. అక్కడే ప్రపోజల్ కూడా పెట్టారట. దాని వల్లే వారి పెళ్లి అక్కడ చేసుకున్నారు.
ఇక వరుణ్ తేజ్ లావణ్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే వీళ్ళ పెళ్లికి సంబంధించిన కొన్ని క్రేజీ పిక్స్ మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతా వేదికగా అభిమానులకు పంచుకున్నారు. ఈ ఫోటోల్లో అంతా బాగున్న ఒక పెద్దాయన మాత్రం మిస్సయ్యారని నెటిజన్స్ గుర్తించారు. దీంతో అభిమానులకు కొత్త డౌట్లు పుట్టుకువస్తున్నాయి. అది కూడా మెగా ఫ్యామిలీకి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ కావడంతో.. ఏమైందా అని కామెంట్స్ పెడుతున్నారు.

ఆ ఫోటోల్లో మిస్ అయిన వ్యక్తి అల్లు అరవింద్. అల్లు అరవింద్ లేకుండా మెగా ఫ్యామిలీలో ఏ ఈవెంట్ .. ఏ పండగ జరగదనే విషయం తెలిసిందే. మరి అలాంటిది ఎందుకు ఆయన రాలేదు.. ఎందుకు ఆయన లేకుండానే ఈ పెళ్లి జరిగిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పెళ్లి ఫోటోల్లో ఆఖరికి పవన్ కూడా ఉన్నారు.. మరి అల్లు అరవింద్ లేకపోడవం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ టాపిక్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇక మొన్న కాక్ టెయిల్ పార్టీలో కూడా ఆయన కనబడలేదు. దీంతో అభిమానులు డౌట్స్ మరింత ఎక్కువ అయ్యాయి. అసలు ఈయన పెళ్లికి ఎందుకు రాలేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం అల్లు అరవింద్ వరుణ్ తేజ్ పెళ్లికి రాకపోవడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది.


Click it and Unblock the Notifications











