ఆహా కోసం మరో స్టార్ హీరోయిన్.. సమంత దర్శకుడితో బిగ్ బడ్జెట్ సిరీస్

ఓటీటీ హవా మొదలైన తరువాత చాలా మంది నిర్మాతలు దర్శకులు భవిష్యత్తు కోసం కొన్ని ఓటీటీ సంస్థలతో డీలింగ్స్ సెట్ చేసుకొని ఒక సెపరేట్ ఛానెల్ ను కూడా క్రియేట్ చేసుకున్నారు. అయితే అల్లు అరవింద్ ఇంటర్నేషనల్ కంపెనీలకు పోటీగా ఆహా యాప్ ను రంగంలోకి దింపి మొదట్లో పెద్ద రిస్క్ చేసినట్లు అంతా భావించారు. కానీ ఆయన ఆలోచనలతో మాత్రం సబ్ స్క్రైబర్స్ ను అమితంగా పెంచేస్తున్నారు.

పెద్దగా లాభాలు రాకపోయినా పరవలేదని మొదట్లో కొంత ఇన్వెస్ట్ చేసిన డబ్బు వస్తే చాలు అనే విధంగా ప్లాన్స్ సెట్ చేసుకున్నారు. ప్రస్తుతం సమంత ఒక షోతో మంచి హైప్ అయితే క్రియేట్ చేస్తోంది. అల్లు అర్జున్ కూడా తన దైన శైలిలో ప్రమోషన్స్ అయితే చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ భారీ బడ్జెట్ తో వెబ్ సిరీస్ లను కూడా నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. అమలా పాల్ కథానాయికగా ఒక హై బడ్జెట్ ఒరిజినల్ సిరీస్ పై ఒక నిర్ణయానికి వచ్చిన అల్లు అరవింద్ దర్శకుడిని కూడా ఫిక్స్ చేశారని సమాచారం.

Allu aravind big budget plans for aha app

సమంతతో యూ టర్న్ అనే సినిమాను డైరెక్ట్ చేసిన కన్నడ దర్శకుడు పవన్ కూడా ఆ వెబ్ సిరిస్ ను డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ కాన్సెప్ట్ క్లిక్కయితే వెంటనే మరో రెండు వెబ్ సిరీస్ లను కూడా నిర్మించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక కొన్ని సినిమాల హక్కులను కూడా దక్కించుకుని డైరెక్ట్ గా ఆహా లో రిలీజ్ చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఆహా యాప్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X