అతి చేయకండి.. అల్లు అరవింద్ చురకలు.. ఈడీ 3 గంటల విచారణ వెనుక అసలు కథ ఏమిటంటే?

బ్యాంక్ రుణం ఎగవేత వ్యవహారంలో తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) ప్రశ్నించింది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిట్రానిక్స్ (RTPL) సంస్థ పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతోపాటు 101 కోట్లకుపైగా రుణం ఎగవేత కేసుతో ఆయనకు లింక్ ఉండటంతో శుక్రవారం ఆయనను 3 గంటలపాటు ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో విచారణను ఎదుర్కొన్న ఆయన మీడియాకు వివరణ ఇచ్చారు. ఈ కేసు గురించి, ఆయన చెప్పిన విషయాల గురించిన వివరాల్లోకి వెళితే..

రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిట్రానిక్స్ (RTPL) సంస్థ పెద్ద ఎత్తున్న ఆరోపణలు రావడంతో హైదరాబాద్ జోన్ ఆఫీస్, అలాగే కర్నూల్, ఘజియాబాద్‌లోని కార్యాలయాలపై భారీగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు, రుణాల వినియోగంలో అవకతవకలు ఈడీ అధికారులు దృష్టికి వచ్చాయి. మంజూరైన రుణాలను నేరపూరిత కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేయడంతో ఈడీ రంగంలోకి దిగింది.

Allu Aravind clarity on ED s 3 hours Grilling in RTPL Bank Fraud Probe

రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిట్రానిక్స్ (RTPL) సంస్థపై మెరుపు దాడులు నిర్వహించిన ఈడీ, సీబీఐ అధికారులు హైదరాబాద్ బెంగళూరులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కంపెనీ డైరెక్టర్లు, భాగస్వాములు వీ రాఘవేంద్ర, వీ రవికుమార్ ఇతరులపై అధికారులు కేసు నమోదు చేసినట్టు జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది.

100 కోట్లకుపైగా కుంభకోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారలు సంస్థలకు సంబంధించిన ఈడీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొన్నది. 1.45 కోట్ల రూపాయలు ఉన్న బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసింది. అలాగే సంస్థకు చెందిన డిజిటల్ పరికరాలు, వస్తువులను కూడా స్వాధీనం చేసుకొన్నది. ఈ మేరకు దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ సంస్థతో వ్యవహారాలు కొనసాగించిన అల్లు అరవింద్‌ను కూడా విచారించింది.

ఈ స్కామ్‌ విచారణలో భాగంగా 3 గంటలపాటు విచారణను ఎదుర్కొన్న అల్లు అరవింద్ తన వంతుగా కేసు గురించి వివరణ ఇచ్చారు. తెలుగు మీడియాతో మాట్లాడుతూ... నేను 2017 సంవత్సరంలో ఓ ప్రాపర్టీ కొన్నాను. అందులో మైనర్ భాగస్వామి అయిన ఓ వ్యక్తి ప్రాపర్టిని కొన్నాను. సదరు వ్యక్తి బ్యాంకులో రుణం తీసుకొని ఎగవేతకు పాల్పడ్డాడు. ఆ రుణ మొత్తాలను అవకతవకలకు పాల్పడ్డారు. ఆ విషయంలో ఈయనపై కేసు నమోదైంది. వారి పుస్తకంలో నా పేరు ఉండటం వల్ల విచారణకు నన్ను పిలిస్తే.. బాధ్యతాయుతమైన పౌరుడిగా వారి నోటీసులకు స్పందించాను అని అల్లు అరవింద్ తెలిపారు.

ఈడీ విచారణకు హాజరై నేను కొనుగోలు చేసిన ప్రాపర్టీకి సంబంధించిన వివరాలను వెల్లడించాను. అంతే తప్పితే.. ఈ విషయాన్ని పెద్దదిగా చేసి వార్తను ప్రచారం చేయడం బాధగా ఉంది. ఎంక్వైరీకి పిలిచారు. నేను వెళ్లి నా వంతుగా చెప్పి వచ్చాను. అంతకంటే ఎక్కువగా చెప్పలేను. ఈడీ పరిధిలో ఉంది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేను. మీకు కొన్ని వివరాలు వెల్లడించలేను అని అల్లు అరవింద్ మీడియాకు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X