బండ్ల గణేష్‌కు అల్లు అరవింద్ సాలిడ్ రిప్లై.. నాకు ఒక స్థాయి ఉందంటూ..
టాలీవుడ్‌లో ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచే వ్యక్తి నిర్మాత బండ్ల గణేష్, నిర్మాతగా, నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన చేసే వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలుస్తాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా ఆయన స్పీచ్‌లు రియాలిటీ కంటే రియాక్షన్ ఎక్కువగా కలిగిస్తున్నాయి. ఎక్కడైనా ఈవెంట్ లేదా సక్సెస్ మీట్ ఉంటే, బండ్ల గణేష్ మాట్లాడకపోతే అదేదో మిస్ అయినట్లే అనిపించే పరిస్థితి ఏర్పడింది. అలా ఓ ఈవెంట్ బండ్ల గణేష్ అల్లు అరవింద్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆ కామెంట్స్ పై నిర్మాత అల్లుఅరవింద్ దిమ్మతిరిగేపోయే రిప్లే ఇచ్చారు. ఇంతకీ అల్లు అరవింద్ ఏమన్నారంటే?
రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన "ది గర్ల్‌ఫ్రెండ్" నవంబర్ 7న విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసింది. సమాజంలోని లవ్, రిలేషన్‌షిప్ సమస్యలను సున్నితంగా చూపించే ఈ కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అల్లు అరవింద్ ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా మీట్‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ "నేను చాలా సినిమాలు తీసాను, డబ్బు సంపాదించాను. కానీ 'ది గర్ల్‌ఫ్రెండ్' మాత్రం తృప్తికోసం తీసాను. ఇది వాణిజ్యపరంగా కాకుండా, మనసుకు దగ్గరైన సినిమా" అని చెప్పారు. 2021లో రాహుల్ రవీంద్రన్ కథ వినిపించినప్పటి నుంచి ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. "ఈ కథలో సమాజానికి చెప్పాల్సిన బోల్డ్ మెసేజ్ ఉంది. మగవాళ్లు ఆడవాళ్ల మనసు ఎప్పుడూ అర్థం చేసుకోలేరు. వారి మనసులో ఉండే కోరికలు, భాదలు, భావోద్వేగాలను ఈ సినిమా సున్నితంగా చూపిస్తుంది. ఈ కథ నెమ్మదిగా మొదలై, చివరికి ఘాటుగా ముగుస్తుంది. చూసిన ప్రతి ఒక్కరి మనసును తాకుతుంది. ఇది చూసిన వారు మర్చి పోలేరు. ఈ సినిమా వెంటే ఉంటుంది," అని అరవింద్ అన్నారు.
అదే సమయంలో అల్లు అర్జున్ మరో కీలకమైన స్టేట్ మెంట్ ఇచ్చారు. "ఈ సినిమాలో ఎన్ని ఫైట్లు ఉన్నాయి, ఎన్ని పంచ్ డైలాగ్స్ ఉన్నాయి అనే ప్రశ్నలు ఈ సినిమాకు వర్తించవు. ఇది ఎమోషన్‌తో, హృదయంతో రూపొందిన చిత్రం. ప్రతి యువకుడు, యువతి తప్పక చూడాల్సిన సినిమా ఇది." అని స్పష్టంగా తెలిపారు.
బండ్ల గణేష్‌పై అల్లు అరవింద్ కౌంటర్!
సమావేశం చివర్లో ఒక విలేఖరి బండ్ల గణేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ.. " బండ్ల గణేష్ ఓ సినిమా ఈవెంట్ లో మీ పై కామెంట్స్ చేశారు. దానికి మీరు ఏమైనా స్పందిస్తారా?" అని ప్రశ్నించారు. దీనికి అల్లు అరవింద్ గారు చిరునవ్వుతో, ఎంతో ప్రశాంతంగా.. "నేను ఆయన గురించి మాట్లాడను... నాకంటూ ఓ స్థాయి ఉంది." అని సూటిగా కానీ గంభీరంగా సమాధానం ఇచ్చారు. అరవింద్ ఇచ్చిన రిప్లే చిన్నగా ఉన్నా.. సాలిడ్ గా ఉందని అన్నారు. "నాకంటూ ఓ స్థాయి ఉంది" అన్న ఆయన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
అసలేం జరిగింది?
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ భక్తుడిగా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్, "గబ్బర్ సింగ్" విజయంతో తన ప్రొడ్యూసర్ ఇమేజ్‌ను బలపరచుకున్నారు. కానీ ఆయన వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు తరచూ వివాదాలకు దారితీస్తున్నాయి. పరిశ్రమలో చాలా మంది నిర్మాతలు, డైరెక్టర్లు ఆయనను కాంట్రవర్సీ క్రియేటర్‌గా భావిస్తున్నా, ఆయనను ఈవెంట్లకు పిలవడం మాత్రం ఆగడం లేదు. బండ్ల గణేష్ మాట్లాడితే షోలో ఎనర్జీ వస్తుందని, పబ్లిసిటీ పెరుగుతుందని ఆర్గనైజర్లు కూడా భావిస్తున్నారు. అయితే, ఈ మధ్య ఆయన వ్యాఖ్యలు కొంచెం "లిమిట్" దాటుతున్నాయని విమర్శకులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఒక ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపింది. లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. "అరవింద్ గారు లాస్ట్ మినిట్‌లో వచ్చి క్రెడిట్ తీసుకెళ్తారు" అని స్టేజిపైనే బండ్ల గణేష్ అనేశాడు. దీంతో తో అక్కడ ఉన్న వారంతా సైలెంట్ అయ్యారు. ఆ సమయానికి అల్లు అరవింద్ చిరునవ్వుతో రియాక్ట్ అయినా, లోపల మాత్రం ఆయన చాలా ఫీల్ అయినట్టు ఇండస్ట్రీ టాక్. అల్లు అరవింద్ కౌంటర్‌తో ఆ చర్చకు ఇప్పుడు కొత్త మలుపు వచ్చింది. ఇక బండ్ల గణేష్ మాత్రం ఈ వ్యాఖ్యపై ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఏ విధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











